ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna laxminarayana: మంత్రి వచ్చాకే మీరు వెళ్లాలి.. కన్నాను అవమానించిన వైసీపీ

ABN, First Publish Date - 2023-04-14T09:50:06+05:30

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ నేత కన్నాను వైసీపీ నేతలు అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గుంటూరు: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చిన టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణను (Kanna Laxminarayana) వైసీపీ నేతలు (YCP Leaders) అడ్డుకుని అవమానించారు. శుక్రవారం లాడ్జి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద వివాదం చోటు చేసుకుంది. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించేందుకు కన్నా రాగా... ఆయనను వైసీపీ నేతలు, దళిత సంఘాల నేతలు అడ్డుకున్నారు. ముందుగా మంత్రి మేరుగ నాగార్జున, కలెక్టర్ వచ్చి నివాళ్లు అర్పించిన తర్వాతే మిగిలినవాళ్లు నివాళులర్పించాలంటూ కార్పొరేటర్ భర్త గేటు వేసేశాడు. దీంతో చేసేదేమీ లేక కన్నా పక్కకు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తర్వాత దళిత సంఘాల నేతలు పక్కకు తప్పుకున్నారు. దీంతో అంబేద్కర్ విగ్రహానికి కన్నా లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి టీడీపీ నేత వెళ్లిపోయారు. కాగా... అంబేద్కర్‌కు నివాళులర్పించేందుకు వచ్చిన కన్నా పట్ల వైసీపీ శ్రేణులు, దళిత సంఘాలు ప్రవర్తించిన తీరుపై టీడీపీ ఎస్సీ సెల్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-14T09:50:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising