Kanna Laxminarayana: చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు
ABN, First Publish Date - 2023-05-31T10:58:55+05:30
టీడీపీ మహానాడు అద్భుతంగా జరిగిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తొలి విడత మ్యానిఫెస్టోను విడుదల చేశారని... మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు ఏం చేస్తారో ఇందులో చెప్పారని తెలిపారు.
గుంటూరు: టీడీపీ మహానాడు (TDP Mahanadu) అద్భుతంగా జరిగిందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Former Minister Kanna Laxminarayana) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) తొలి విడత మ్యానిఫెస్టోను విడుదల చేశారని... మహిళలకు, యువతకు, రైతులకు, బీసీలకు ఏం చేస్తారో ఇందులో చెప్పారని తెలిపారు. మహానాడుతో వైసీపీ (YCP) వెన్నులో దడ పుడుతోందన్నారు. బూతులు తప్ప ఈ నాలుగేళ్ళలో వైసీపీ సాధించింది ఏమీ లేదన్నారు. సామాజిక న్యాయం చేసింది టీడీపీనే అని స్పష్టం చేశారు. చంద్రబాబు రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని అన్నారు. సంపద సృష్టించి ఆదాయం పెంచి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. సీపీఎస్ రద్దు, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం, పోలవరం, స్పెషల్ స్టాటస్, ధరలు స్థిరీకరణ నిధి, జాబ్ క్యాలెండర్, గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బూతులు తిట్టడానికి శాసనసభ్యత్వం, మంత్రి పదవులు ఎందుకు అని నిలదీశారు. పరిపాలన చేతగాక పోతే పారిపోవాలన్నారు. బూతులు తిట్టేవారిని తామూ తయారు చేస్తామని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Updated Date - 2023-05-31T10:58:55+05:30 IST