TDP: వైసీపీ నేత కాల్పుల్లో గాయపడ్డ బాలకోటిరెడ్డి పరిస్థితి విషమం
ABN, First Publish Date - 2023-02-17T11:25:02+05:30
వైసీపీ నేతల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది.
పల్నాడు: వైసీపీ నేతల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేత వెన్నా బాలకోటిరెడ్డి (TDP Leader Venna Balakoti Reddy) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 1న రాత్రి బాలకోటిరెడ్డి (TDP Leader) పై వైసీపీ నేతలు (YCP Leaders) కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. స్వగ్రామం రొంపిచర్ల మండలం ఆలవాలలోని ఇంటి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే బాలకోటిని కుటుంబసభ్యులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించారు. బాలకోటిరెడ్డిని టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబు స్వయంగా అంబులెన్స్‌లో గుంటూరు తరలించారు.
కాగా.. టీడీపీ నేత బాలకోటిరెడ్డిపై రెండు సార్లు హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది బాలకోటిరెడ్డి ఉదయం వాకింగ్ చేస్తుండగా.. కొందరు వ్యక్తులు ఆయనపై కత్తులు, గొడళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలకోటిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. ఈ ప్రమాదంలో బాలకోటిరెడ్డి ప్రాణాపాయస్థితి నుంచి తృటిలో బయటపడినప్పటీ తాజాగా మరోసారి ఆయనపై కాల్పులు జరగడం కలకలం రేపింది. ఈనెల 1న బాలకోటిరెడ్డిపై వైసీపీ నేత పమ్మి వెంకేటశ్వరరెడ్డి (YCP Leader Pammi Venkateshwar Reddy) కాల్పులు జరిపాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలకోటిని బయటకు పిలిచి మరీ తుపాకీతో రెండు సార్లు కాల్చాడు. అనంతరం వైసీపీ నేత అక్కడి నుంచి పరారయ్యాడు. కాల్పులతో బాలకోటిరెడ్డి అక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది.
Updated Date - 2023-02-17T11:39:33+05:30 IST