Guntur: దొంగ ఓట్ల గుట్టు రట్టు చేసిన టీడీపీ నేతలు
ABN , First Publish Date - 2023-06-07T17:33:39+05:30 IST
గుంటూరు: శ్యామలానగర్‌లో దొంగ ఓట్లు కలకలం రేగింది. ఒకే డోర్ నెంబర్‌పై 140కిపైగా ఓట్ల నమోదు అంశాన్ని టీడీపీ నేతలు గుర్తించారు.

గుంటూరు: శ్యామలానగర్‌లో దొంగ ఓట్లు కలకలం రేగింది. ఒకే డోర్ నెంబర్‌పై 140కిపైగా ఓట్ల నమోదు అంశాన్ని టీడీపీ నేతలు (TDP Leaders) గుర్తించారు. స్వయంగా ఇళ్లవద్దకు వెళ్లి టీడీపీ ఇన్చార్జ్ కోవెలమూడి రవీంధ్ర (Kovelamudi Ravindra) పరిశీలించారు. ఆయా డోర్ నెంబర్‌లో ఎవరూ నివాసం లేకపోవడంతో టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. వైసీపీ నేతలు (YCP Leaders) దొంగదారిలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని కోవెలమూడి రవీంధ్ర ఆరోపించారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ దొంగఓట్లతో గెలిచిందని విమర్శించారు. వైసీపీ దొంగ ఓట్ల కుట్రను అడ్డుకుంటామని చెప్పారు. తక్షణం దొంగ ఓట్లు తొలగించకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
