ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Uma: బాబాయ్ హత్యకేసులో ముద్దాయిలను కాపాడేందుకే జగన్ ఢిల్లీలో పైరవీలు

ABN, First Publish Date - 2023-01-31T20:45:59+05:30

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ (Cm JaganMohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister of AP Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్టీఆర్ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి‌ (Cm JaganMohan Reddy)పై టీడీపీ (TDP) సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Former Minister of AP Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు. జగన్‌రెడ్డి అభద్రతాభావంలో ఉన్నారని దేవినేని ఉమ అన్నారు.

బాబాయ్ హత్యకేసులో ముద్దాయిలను కాపాడడానికి ఢిల్లీలో పైరవీలు చేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. వివేకా కేసులో కుట్రదారులను సీబీఐ వెలుగులోకి తెస్తోందని, దీన్ని డైవర్షన్ చేసేందుకే తెరపైకి విశాఖ వ్యవహారాన్ని తెచ్చారని దేవినేని ఉమ మండిపడ్డారు. కేసు విచారణలో ఉండగా సీఎం జగన్ ఎలా మాట్లాడుతారు? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్‌పై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Achchennaidu) మాట్లాడుతూ వాస్తవాలు మాట్లాడితే కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. జీడీపీ బాగుంటే జీతాలు ఎందుకు ఇవ్వడం లేదు? అని అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తప్పుడు హామీలతో జగన్‌ సీఎం అయ్యారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీబీఐ (CBI) విచారణతో నిజమైన ముద్దాయి జైలుకెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. అవినాష్‌రెడ్డి(Avinash Reddy)ని సీబీఐ పిలిచినప్పటి నుంచి జగన్‌రెడ్డి(Cm JaganMohan Reddy)కి నిద్ర పట్టడం లేదని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఎద్దెవా చేశారు.

Updated Date - 2023-01-31T20:47:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising