ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: ఏపీలో కరెంట్ కష్టాలు.. ఆ సంస్థ వల్లనే..

ABN, First Publish Date - 2023-09-02T16:21:25+05:30

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతకాని తనంవల్ల కరెంటు కోతలు(Power cuts) విపరీతంగా పెరిగాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత, అవగాహన లేమి, చేతకాని తనంవల్ల కరెంటు కోతలు(Power cuts) విపరీతంగా పెరిగాయని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు. శనివారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు ముందు రైతులకు 9 గంటలు నిరాటంకంగా కరెంటు ఇస్తామని జగన్‌‌రెడ్డి(Jagan Reddy) హామీలు ఇచ్చి నేడు రాష్ట్రంలో మూడు నాలుగు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు కోతలతో కొట్టు మిట్టాడుతుంటే, సీఎం విద్యుత్ శాఖతో ఏనాడైనా సమీక్షించారా?పీపీఎల్ రద్దు చేయొద్దు, కొనసాగించాలని చంద్రబాబు కోరినా కమిషన్ల కోసం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టి.. నోటీసులు జారీ చేసినా బుద్ధి రాలేదు.ఎన్నికలకు ముందు కరెంటు చార్చీలు పెంచనని నంగనాచి కబుర్లు చెప్పి 8 సార్లు కరెంటు చార్జీలు పెంచింది మీరుకాదా?చంద్రబాబునాయుడు హయాంలో ఒక్కసారి కూడా కరెంటు చార్జీలు పెంచలేదు.కరెంటు కోతలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాల్లో ఏపీని మొదటిస్థానంలో పెట్టిన ఘనత మీది. మిగులు కరెంటు రాష్ట్రంగా చేసి దేశంలోనే ఆదర్శంగా రాష్ట్రాన్ని నిలిపిన ఘనత చంద్రబాబు ది.ఎండాకాలంలో కాస్తో కూస్తో కరెంటు కోతలుంటాయే మోగానీ, వర్షాకాలంలో కరెంటు కోతలు మీ అసమర్థ పాలనకు నిదర్శనం.

పులివెందుల సబ్ స్టేషన్ ముందు రైతులు బైఠాయించి కరెంటు ఇవ్వమని అడిగినందుకు కేసులు పెట్టారు. అలా అయితే.. కరెంటు సరిగా ఇవ్వని ప్రభుత్వంపై ఎన్ని కేసులు పెట్టొచ్చు? మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మైన్స్ తవ్వుకోవడం, ఇసుక దోచుకోవడం తప్ప కరెంటు కోతల మీద ధ్యాస లేదు.రాష్ట్రం పవర్ హాలిడే ప్రకటించే స్థాయికి రాష్ట్రం వెళ్లడం దౌర్భాగ్యం.విద్యుత్ లేక ఆక్సిజన్ యంత్రాలు పనిచేయక ఆక్వా రంగం కుదేలైంది.రాష్ట్రమంతా చీకట్లో మగ్గుతుంటే.. తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్ దేదీప్యమానంగా వెలిగితే సరిపోతుందా? వైసీపీ నేతలకు జగన్ క్విడ్ ప్రోకో ద్వారా లబ్ధి చేకూర్చే పనులు చేయడం తప్పితే ప్రజలకు లబ్ది చేకూరే పనులెప్పుడైనా చేశారా? దళితుడికిచ్చే 200 యూనిట్ల ఉచిత కరెంటు దళితవాడలో ఉంటేనే అని మెలికపెట్టి అన్యాయం చేయడం తగదు.దళిత బిడ్డల మేనమామ అని చెప్పి ఓట్లు వేయించుకొని దళితులకు తీరని అన్యాయం చేయడం సబబా?క్విడ్ ప్రోకో కింగ్ అయిన ముఖ్యమంత్రి ఏ కంపెనీ, ఏ కార్పొరేట్ సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలి.హిందూజా కంపెనీ వారు ఆశించినంత ఇస్తారని క్విడ్ ప్రోకోకు పాల్పడుతున్నారా?హిందూజా కంపెనీకి 11 ఎకరాల భూమి క్విడ్ ప్రోకో కింద ధారాదత్తం చేసింది నిజంకాదా? కరెంటు కోతలు ఇలా ఉంటే చిన్నపిల్లలు, వృద్ధుల పరిస్థితేంటి?ప్రజలు తాము చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి సమయం కోసం వేచి ఉన్నారని సీఎం గ్రహించాలి’’ అని వర్లరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-02T16:21:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising