Varla Ramaiah: జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారింది
ABN, First Publish Date - 2023-11-02T20:27:03+05:30
సీఎం జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారిందని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) ఎద్దేవ చేశారు.
అమరావతి: సీఎం జగన్ చేతిలో సీఐడీ కీలు బొమ్మగా మారిందని తెలుగుదేశంపార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ( Varla Ramaiah ) ఎద్దేవ చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘జగన్ సీఐడీని అడ్డుపెట్టుకుని తన రాజకీయ ప్రత్యర్థులను సాధిస్తున్నారు. గతంలో జగన్ గొంతెమ్మ కోర్కెలు తీర్చలేక సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ తన బాధ్యత నుంచి బయటకు వెళ్లారు. ప్రస్తుత సీఐడీ చీఫ్ సంజయ్ జగన్‌కి, సజ్జలకు దాసోహం చేస్తున్నారు. సీఐడీ ధర్యాప్తులో పారదర్శకత పాటించకుండా జగన్ కళ్లలో ఆనందం చూడటం కోసం పరిధి దాటి సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఓ ముఖ్యమైన కేసు ధర్యాప్తులో ఉండగా కోర్టు పరిధిలో చర్చలు జరుగుతున్నపుడు ఆ కేసు గురించి సీఐడీ హైదరాబాద్, ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టడం సీఐడీకి తగదు. సీఐడీ జగన్‌కి ఎంత దాసోహం చేస్తుందో అర్ధవువుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ సమయంలో వీడియో కాల్ ద్వారా సీఐడీ అధికారులు ఆ ప్రక్రియను లండన్‌లో ఉన్న జగన్‌కి చూపించటం నిజం కాదా? చంద్రబాబు ఇంటరిమ్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తే రాజకీయ ఉపన్యాసం చేశారని సంజయ్ కోర్టులో చెప్పటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి చంద్రబాబుకి 14 గంటలు పట్టిందంటే అది రూట్ క్లియర్ చేయలేని పోలీసులు, ప్రభుత్వ అసమర్ధత అవుతుంది. గతంలో రాష్ట్ర సీఐడీకి మంచి పేరు ఉండేది. ప్రస్తుతం జగన్ హయంలో సీఐడీ పూర్తిగా దిగజారిపోయి ఉనికి కోల్పోతుంది’’ అని వర్లరామయ్య దెప్పిపొడిశారు.
Updated Date - 2023-11-02T20:27:24+05:30 IST