ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu Case: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-11-15T16:29:35+05:30

Andhrapradesh: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ హైకోర్టులో వాయిదా పడింది. బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా... సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రతీకార కేసు కాదని.. గత ప్రభుత్వ హయంలోనే స్కిల్ స్కాంపై దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు.

అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) బెయిల్ పిటిషన్‌‌పై విచారణ హైకోర్టులో (AP HighCourt) వాయిదా పడింది. బుధవారం చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు రాగా... సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి (AAG Ponnavolu Sudhakar Reddy) వాదనలు వినిపించారు. ఈ కేసు ప్రతీకార కేసు కాదని.. గత ప్రభుత్వ హయంలోనే స్కిల్ స్కాంపై దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు. 2018లోనే సీఐడీ (CID), సీబీఐకి (CBI) కూడా ఫిర్యాదు అందిందని కోర్టుకు తెలిపారు. సీమెన్స్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్‌లో కూడా అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని నిర్ధారించారని ఏఏజీ వెల్లడించారు. స్కిల్ కేస్‌లో దోచుకున్న డబ్బంతా హవాలా మార్గంలో చివరికి హైదరాబాద్‌కు చేరిందని... దానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని వాదించారు. ఫోరెన్సిక్ ఆడిట్ కూడా రూ.241 కోట్లు దారి మళ్లాయని నిర్ధారించిందన్నారు. అసలు ప్రాజెక్ట్ విలువ రూ.36 కోట్లు మాత్రమే అని.. దాన్ని వేల కోట్లు పెంచి చూపించారన్నారు. నిధుల విడుదలపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఫైనాన్స్ సెక్రెటరీ వద్దన్నా కూడా చంద్రబాబు ఆదేశాలతో చీఫ్ సెక్రటరీ నిధులు విడుదల చేయమని ఆదేశాలిచ్చారన్నారు. సీఎం విడుదల చేయమంటేనే నిధులు విడుదల చేస్తున్నట్లు పీపీ రమేష్ నోట్ ఫైల్‌లో రాశారన్నారు. కేంద్ర సంస్థ సీఐటీడీని కూడా మేనేజ్ చేసి తప్పుడు రిపోర్ట్ తీసుకున్నారని అదే రిపోర్ట్‌ను ఉపయోగించి ఈ రేట్లను సెంట్రల్ గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసిందని అన్ని కోర్టులలో ప్రచారం చేస్తున్నారని ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రేపు (గురువారం) మధ్యాహ్నం 2:30 గంటలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-11-15T16:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising