MLC Elections: జగన్ గాల్లో పల్టీలు కొట్టారు: చంద్రబాబు

ABN, First Publish Date - 2023-03-24T17:15:42+05:30

ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) సీఎం జగన్ (CM Jagan) గాల్లో పల్టీలు కొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవాచేశారు. జగన్ ఎంతో కసరత్తు చేశారు.

MLC Elections: జగన్ గాల్లో పల్టీలు కొట్టారు: చంద్రబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) సీఎం జగన్ (CM Jagan) గాల్లో పల్టీలు కొట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవాచేశారు. జగన్ ఎంతో కసరత్తు చేశారు. చివరికి బొక్క బోర్లా పడ్డారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలే తమ అసంతృప్తిని బయటపెట్టారని, బయటకు రాని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారని తెలిపారు. వైసీపీ సేవాదళ్ అధ్యక్షుడే ఆ పార్టీలో ఉండలేకపోయారని, నమ్మకంగా ఉండే నేతలే జగన్‌ను వీడి వెళ్తున్నారని తెలిపారు. పులివెందుల (Pulivendula)లో కూడా టీడీపీ జెండా ఎగిరిందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జగన్‌కు షాకిచ్చాయని, తాడేపల్లిలో టీవీలు పగిలిపోతున్నాయని తెలిపారు. జగన్‌రెడ్డి రాజధాని అమరావతిని భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. గిరిధర్‌రెడ్డి చేరికతో పార్టీ మరింత బలపడుతుందన్నారు. అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని జగన్ చూశారని, దేవుడు స్క్రిప్ట్ తిరగరాశాడని చంద్రబాబు తెలిపారు.

చంద్రబాబు సమక్షంలో గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. గిరిధర్‌రెడ్డికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి చంద్రబాబు ఆహ్వానించారు. గిరిధర్‌రెడ్డి టీడీపీ చేరుతున్న నేపథ్యంలో నెల్లూరు నగరంలో చంద్రబాబు, లోకేష్ (Lokesh) ఫొటోలున్న ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గిరిధర్‌రెడ్డి నెల్లూరు నుంచి భారీ కాన్వాయ్‌తో తాడేపల్లి వెళ్లి టీడీపీలో చేరారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానని కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ప్రకటించారు. ఓ సామాన్య కార్యకర్తగా ఉండటమే తనకిష్టమని చెప్పారు. నెల్లూరు జిల్లలో 10కి 10 స్థానాలు సాధిస్తామని గిరిధర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-24T17:15:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising