పాలేటమ్మ జాతర
ABN , First Publish Date - 2023-03-10T23:17:38+05:30 IST
కేశాపురం పంచాయతీ దేవళంపేటలో కడప- బెంగుళూరు జాతీయ రహదారిపై వెలసిన పాలేటమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది.

చిన్నమండెం, మార్చి10: కేశాపురం పంచాయతీ దేవళంపేటలో కడప- బెంగుళూరు జాతీయ రహదారిపై వెలసిన పాలేటమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. వివి ధ ప్రాంతాలు, పక్కనే ఉన్న చిత్తూరు, కడప జిల్లా నుంచి పెద్ద ఎత్తున భక్తులు జాతరలో పాల్గొన్నారు. మొక్కుబడి ఉన్న వారు 17 మంది చాందినీ బండ్లు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
చాందినీ బండ్ల వద్ద చెక్కభజనలు, కోలాటం, డీజే పా టలు, ఆర్కెస్ర్టా భక్తులను అలరింపజేశాయి. జాతరలో భక్తులకు మానవతా స్వచ్ఛం ద సంస్థ తాగునీటిని అందించింది. జాతరలో 65 మంది పోలీసు సిబ్బంది, ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.