ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viveka Murder Case: సీబీఐకి కీలక విషయాలు వెల్లడించిన సునీత

ABN, First Publish Date - 2023-07-22T14:28:06+05:30

హైదరాబాద్: వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత సీబీఐకి కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య కేసు ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు.

హైదరాబాద్: వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత (Narreddy Sunitha) సీబీఐ (CBI)కి కీలక విషయాలు వెల్లడించారు. వివేకా హత్య కేసు (Viveka Murder Case) ఛార్జిషీటుతో పాటు సునీత వాంగ్మూలాలను కూడా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. ఇంటికొచ్చి కలుస్తానంటూ 2019 మార్చి 22న వైఎస్ భారతి (Bharathi) తనకు ఫోన్ చేశారని, అయితే తాను కడప, సైబరాబాద్‌ కమిషనరేట్‌కు వెళ్లాల్సి ఉందని భారతికి చెప్పానన్నారు. దీంతో ఎక్కువ సమయం తీసుకోనంటూ.. భారతీ వెంటనే ఇంటికి వచ్చారని, ఆమెతో పాటు విజయలక్ష్మి (Vijayalakshmi), వైఎస్ అనిల్ రెడ్డి (YS Anil Reddy), సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కూడా రావడంతో ఆశ్చర్యపోయానన్నారు.

లిఫ్టు వద్దే నిలబడి వైఎస్ భారతితో మాట్లాడానని, ఆమె ఆందోళనగా కనిపించారని సునీత అన్నారు. అయితే తండ్రి వివేకా మరణించాక తొలిసారి ఇంటికి వచ్చినందున బాధగా ఉన్నారని అనుకున్నానన్నారు. ఇకపై ఏం చేసినా సజ్జల రామకృష్ణారెడ్డితో టచ్‌లో ఉండాలని భారతి చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడాలని సజ్జల తనకు చెప్పారని, సజ్జల ఆలోచన కొంత ఇబ్బందిగా అనిపించి వీడియో చేసి పంపించానని సునీత చెప్పారు. గది శుభ్రం చేసేటప్పుడు ఉన్న సీఐ శంకరయ్యపై ఫిర్యాదుతో ఆ వీడియో పంపించానన్నారు. అయితే వీడియో కాదు.. అంశానికి ముగింపు పలికేలా ప్రెస్‌మీట్‌ పెట్టాలని సజ్జల చెప్పారన్నారు. జగనన్నతో పాటు అవినాష్ పేరు కూడా ప్రస్తావించాలని సజ్జల సలహా ఇచ్చారని, అయితే తాను అప్పటి వరకు అవినాష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. అవినాష్ పేరు ప్రస్తావించాలని సజ్జల చెప్పినప్పుడు కొంత సంకోచించానన్నారు. అవినాష్ అభ్యర్థిత్వాన్ని తన తండ్రి కోరుకోలేదని తెలుసునని, రెండు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా విబేధాలు ఉన్నాయని, సజ్జల సలహా మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ మీట్ పెట్టానని సునీత తెలిపారు.

2019 జులైలో అవినాష్ రెడ్డిపై తనకు అనుమానం మొదలైందని, మా కుమారుడికి ముందే తెలుసునని గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి ఒకరితో చెప్పారని సునీత పేర్కొన్నారు. వివేకా మృతి విషయం బయటకు రాకముందే తన కుమారుడికి తెలుసునని ఆమె చెప్పారని, అవినాష్ రెడ్డి, శివశంకర్‌ రెడ్డికి ఉదయ్ ప్రధాన అనుచరుడు కాబట్టి తనకు అనుమానం వచ్చిందన్నారు. ఈ క్రమంలో భారతి, సజ్జల వాట్సప్ చాట్ స్క్రీన్ షాట్‌లను సీబీఐకి సునీత ఇచ్చారు.

గదిని శుభ్రం చేయడంపై దర్యాప్తు చేయాలని మొదట్నుంచీ అడుగుతున్నానని, పొరపాటు జరిగిందని తెలుసు కానీ క్రిమినల్ మైండ్ ఎలా పనిచేస్తుందో అర్థంచేసుకోలేదని సునీత అన్నారు. జగనన్నను సీఎంగా చూడాలని తండ్రి వివేక చాలా కష్టపడ్డారన్నారు. ఎవరో చేసిన పొరపాటు వల్ల మళ్లీ జగన్ నష్టపోవాలా అని ఆలోచించానని, తాను మార్చురీ బయట ఉన్నప్పుడు ఓ ఫిర్యాదు రాసుకొచ్చి సంతకం చేయమన్నారని, ఆ ఫిర్యాదులో బీటెక్ రవి, ఇతర టీడీపీ నేతలపై ఆరోపణలున్నాయన్నారు. వివేకా ఎన్నికల ప్రచారానికి టీడీపీ నేతలు భయపడ్డారని అవినాష్ తనకు చెప్పారని, అది మనసులో పెట్టుకొని టీడీపీ నేతలే ఈ నేరానికి పాల్పడ్డారని అవినాష్ చెప్పారన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై తాను సంతకం చేయలేదని సునీత తెలిపారు.

Updated Date - 2023-07-22T14:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising