ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News : నాటి కేసును తిరగదోడి.. బీటెక్ రవిపై నాన్‌బెయిలబుల్ కేసా? టీడీపీ నేతల ఫైర్..

ABN, First Publish Date - 2023-11-15T10:54:44+05:30

పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టులోకి పంపించలేదని పోలీసులకు బీటెక్ రవికి మధ్య గొడవ జరిగింది.

కడప : పులివెందుల ఇన్‌చార్జి బీటెక్ రవిని నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. 10 నెలల క్రితం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టులోకి పంపించలేదని పోలీసులకు బీటెక్ రవికి మధ్య గొడవ జరిగింది. అప్పట్లో వల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 324 సెక్షన్ కింద కేసు నమోదైంది.

ఇప్పుడు దానిని పోలీసులు నాన్ బెయిలబుల్‌గా మార్చారు. రాత్రి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం నివాసం వద్ద జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. 10 నెలల తరువాత చిన్నగొడవ కేసును ఇప్పుడు నాన్ బెయిలబుల్‌గా మార్చి అప్పటికప్పుడు జడ్జి నివాసం వద్ద 41ఎ నోటీసు ఇచ్చి అర్దరాత్రి హాజరుపరచడంపై మొదట జడ్జి అభ్యంతరం తెలిపారు.

పోలీసుల రిక్వెస్ట్‌తో.. 14 రోజుల పాటు రిమాండ్‌కి తరలించడంతో అర్ధరాత్రి తరువాత కడప సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. పాత కేసులను తిరగదోడి ఇప్పుడు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంపై జగన్ ప్రభుత్వంతో పాటు పోలీసులపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బీటెక్ రవి అడ్డగోలు కేసులపైనే కోర్టులోబెయిల్‌ కోసం అప్లై చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - 2023-11-15T10:54:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising