Durgamma Temple: ఇంద్రకీలాద్రిపై ఆషాడమాసం సారె ప్రారంభమెప్పుడో చెప్పిన ఈవో
ABN , First Publish Date - 2023-06-10T14:46:37+05:30 IST
ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో జూన్ 19 నుంచి ఆషాడమాసం సారె ప్రారంభంకానున్నట్లు దుర్గుగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు.
విజయవాడ: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ (Kanakadurgamma Temple) సన్నిధిలో జూన్ 19 నుంచి ఆషాడమాసం సారె ప్రారంభంకానున్నట్లు దుర్గుగుడి ఈవో భ్రమరాంబ ప్రకటించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... జూలై 1 ,2 ,3 తేదీలలో ఆషాడ మాసంలో నిర్వహించే శాకంబరీ దేవి ఉత్సవాలు జరుపనున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది ఆషాడంలో శాకంబరీ ఉత్సవాలు నిర్వహణ ఉంటుందన్నారు. శాకంబరీ ఉత్సవాలకు దాతల ద్వారా కూరగాయలు, పళ్ళు సేకరించనున్నట్లు చెప్పారు. జూలై రెండవ తేదీన ఇంద్రకీలాద్రి అమ్మవారికి ఆషాడ మాసం సారెను, బంగారపు బోనాన్ని హైదరాబాద్ మహంకాళి బోనాల కమిటీ సమర్పించనుందని తెలిపారు. సుమారు 5000 మందితో భక్తులతో, మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో, బేతాళ వేషాలతో హైదరాబాద్ మహంకాళి బోనాలు కమిటీ బోనాలు సమర్పించనుందన్నారు. జులై 14న హైదరాబాద్ బోనాల కమిటీ వాళ్లు నిర్వహించే 8 గ్రామదేవతల ఉత్సవాలకు ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులను మహంకాళి అమ్మవారి బోనాల కమిటీ ఆహ్వానించినట్లు ఈవో భ్రమరాంబ వెల్లడించారు.