Kesineni Nani : మంత్రి సురేష్ దగ్గరుండి వైసీపీ కార్యకర్తలను చంద్రబాబుపైకి ఉసిగొల్పారు
ABN, First Publish Date - 2023-04-22T07:52:26+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతల దాడిని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఖండించారు.
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ నేతల దాడిని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఖండించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ దగ్గరుండి వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ పైకి ఉసిగొల్పారన్నారు. ప్రతిపక్ష నేత కాన్వాయ్‌పై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను టీడీపీ ధైర్యంగా ఎదుర్కొంటుందని తెలిపారు. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా వైసీపీకి చెల్లిస్తామని ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు.
Updated Date - 2023-04-22T07:52:26+05:30 IST