ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీలో మైక్ ఇవ్వకుంటే.. : కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-03-15T09:30:54+05:30

సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో‌ని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి : సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన తెలిపారు. తన నియోజకవర్గంలో‌ని సమస్యల ప్ల కార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీకి పాదయాత్ర నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుపై కోటంరెడ్డి స్పందించారు. తన అంతరాత్మ ప్రభోదానుసారమే ఓటు వేస్తానని తెలిపారు. వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారం ఓటు వేస్తారని భావిస్తున్నా నన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి తన నిరసన కొనసాగుతుందన్నారు. సమస్యలను పరిస్కరిస్తే తానే ముఖ్యమంత్రి ని అభినందిస్తానన్నారు. 4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నానన్నారు. మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటానన్నారు. మైక్ ఇవ్వకుంటే తన నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటానన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి రాజధాని రైతులు మద్దతు తెలిపారు. ప్లకార్డు ప్రదర్శన వద్దంటూ కోటంరెడ్డిని పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వెళ్లే తనని అడ్డుకునే హక్కు పోలీసులకు లేదంటూ ప్లకార్డు ప్రదర్శనతోనే అసెంబ్లీకి కోటంరెడ్డి వెళ్లారు.

Updated Date - 2023-03-15T09:30:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising