న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలి
ABN , First Publish Date - 2023-04-16T00:22:21+05:30 IST
న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ది మొవ్వ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చల్లపల్లిలో శనివారం ఆం దోళన చేపట్టారు.

చల్లపల్లి, ఏప్రిల్ 15 : న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ ది మొవ్వ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చల్లపల్లిలో శనివారం ఆం దోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. న్యాయాన్ని రక్షించే న్యాయవాదికి రక్షణ లేకుండా పోయిందని, దేశవ్యాప్తంగా అడ్వకేట్లపై దాడులు పరిపాటిగా మారాయని అసోసియేషన్ నేతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇతర రాష్ట్రాలలో వలె ఏపీలోను అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పులి శ్రీనివాసరావు, కొల్లూరి రామాం జనేయులు, వెంకటేశ్వరరావు, ద్వారకానాధ్ పాల్గొన్నారు.