AP Budget Session: రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ABN, First Publish Date - 2023-03-15T09:24:46+05:30
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Budget Session) రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగా స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Sitharam) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. బీఏసీ (BAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jaganmohan reddy) సభ ముందు ఉంచనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణాన్ని ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి (MLA Kolusu Parthasaradi) సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై మాజీ మంత్రి కన్నబాబు (Former Minister Kannababu)మాట్లాడనున్నారు. తరువాత గవర్నర్ ప్రసంగానికి ముఖ్యమంత్రి జగన్ ధన్యవాదాలు తెలుపనున్నారు.
మరోవైపు ఈరోజు అసెంబ్లీలో జరుగునున్న ప్రశ్నత్తరాల్లో కీలక ప్రశ్నలను టీడీపీ సభ్యులు అడుగనున్నారు. . రాష్ట్రంలో ప్రక్రుతి సేధ్యం ప్రోత్సాహానికి తీసుకున్న చర్యలపై ప్రశ్నించనున్నారు. అలాగే రాష్ట్రంలో విద్యుత్ తీగలు తెగడంతో ప్రమాదాలు జరగుతున్న విషయం వాటి నిర్వహణ లోపాలపై టీడీపీ సభ్యులు ప్రశ్నించనున్నారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి వెచ్చించిన మొత్తం ఎంత, వాటి పురోగతిపై ప్రశ్నించనున్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటుకు విద్యార్ధులు మల్లడం, పాఠశాలల్లో మొత్తం చదువుతున్న విద్యార్ధుల సంఖ్య, ప్రభుత్వం వారిని తిరిగి బడిలో చేర్పిచండానికి తిరిగి తీసుకుంటున్న చర్యలపై టీడీపీ సభ్యులు ప్రశ్న వేయనున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతులు రాజకీయ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారా తెలుగు దేశం సభ్యులు ప్రశ్నించనున్నారు. కర్నాటక నిర్మిస్తున్న ఎగువ భద్ర నీటి పారుదల ప్రాజెక్టు వల్ల రాయలసీమ ప్రాంతం నీటి వనరులు ప్రభావితం అవుతుండడంపైనా ప్రభుత్వాన్ని టీడీపీ ప్రశ్నించనుంది.
Updated Date - 2023-03-15T09:46:28+05:30 IST