ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tulasi Reddy: ‘ఆర్థిక బలం లేదన్న జగన్.. రూ.510కోట్ల ఆస్తులపై ఏం చెప్తారు?’

ABN, First Publish Date - 2023-04-13T12:35:44+05:30

ముఖ్యమంత్రి జగన్, అబద్ధాలు కవల పిల్లలు అని ఏపీ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ముఖ్యమంత్రి జగన్ (AP CM Jaganmohan Reddy), అబద్ధాలు కవల పిల్లలు అని ఏపీ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్ డాక్టర్ ఎన్. తులసి రెడ్డి (AP Congress Committee Media Chairman Dr. N. Tulsi Reddy) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడం జగన్‌ (AP CM)కు పరిపాటి అయిందన్నారు. తనకు ఆర్థిక బలం లేదని ఇటీవల ముఖ్యమంత్రి బహిరంగ సభలో చెప్పారన్నారు. అయితే దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి, అత్యంత పేదరాలు మమత బెనర్జీ (Mamata Banerjee) అని ఏడీఆర్ నివేదిక (ADR report) స్పష్టం చేసిందన్నారు. 2019 ఎన్నికల అఫిడవిట్ వివరాల ఆధారంగా జగన్ ఆస్తి విలువ రూ.510 కోట్లు అని.. మిగతా 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తి విలువ కూడిన జగన్ కంటే తక్కువే అని చెప్పుకొచ్చారు. తనకు మీడియా బలం లేదని, జగన్ బహిరంగ సభలో చెప్పారని... సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ జగన్‌వే అని అందరికీ తెలుసన్నారు. బొంకర బొంకర పొలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నట్లున్నాయి జగన్ మాటలు ఉన్నాయని యెద్దేవా చేశారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ జగన్‌కు సూచిస్తోందని తులసిరెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2023-04-13T12:35:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising