ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: సీఎం జగన్ ధన దాహం వల్లే విద్యుత్ ఛార్జీల భారం..

ABN, First Publish Date - 2023-06-11T13:58:03+05:30

విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపు, సర్ ఛార్జీల పేరుతో వసూళ్లను వ్యతిరేకిస్తూ ఆదివారం, విజయవాడ, సింగ్‌నగర్‌లో టీడీపీ ఆందోళన చేపట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Charges Increase), సర్ ఛార్జీ (Sir Charge)ల పేరుతో వసూళ్లను వ్యతిరేకిస్తూ ఆదివారం, విజయవాడ, సింగ్‌నగర్‌లో టీడీపీ (TDP) ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ (Bonda Uma) మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy) ధన దాహం వల్ల విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్నారని విమర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచనని జగన్ అన్న విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కూడా ఊరూరా తిరిగి హామీ ఇచ్చారన్నారు. నాలుగేళ్లల్లో యాభై వేల‌కోట్లు ప్రజల నుంచి దోచారని, పక్కనున్న రాష్ట్రాల్లో పెరగని విద్యుత్ ఛార్జీలు ఒక్క ఏపీలోనే ఎందుకు పెరుగుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం (AP Govt.) యూనిట్‌కు ఆరు నుంచి ఎనిమిది రూపాయలకు కొనుగోలు చేస్తోందని, కమీషన్లకు కక్కుర్తి పడి జగన్మోహన్ రెడ్డి అవినీతితో కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని ఆరోపించారు.

ఇతర రాష్ట్రాల్లో యూనిట్ రెండు రూపాయలకే కొంటున్నారని, అంటే సీఎం జగన్ యూనిట్‌కు నాలుగు రూపాయల దోపిడీ‌ చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. బాదుడే బాదుడు అన్న జగన్ .. భారాల బాదుడుని ప్రజలు మోయలేక పోతున్నారని అన్నారు. ఆదాయం పెంచుకోవడం చేతకాని జగన్.. డబ్బు అవసరం అయితే ప్రజల మీద పడి దోచేస్తున్నారని మండిపడ్డారు. ఎరియర్స్ పేరుతో ఒక దోపిడీ, ట్రూ అప్ ఛార్జీలు పేరుతో మరో దోపిడీ, పరికరాల లెక్క కట్టి అదనపు డిపాజిట్‌ల పేరుతో మరో దోపిడీ చేస్తున్నారని, ఒక్క నెల బిల్లు కట్టకపోతే ఇళ్ల మీదకు పంపి ఫీజులు పీకిస్తారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి మాటలు కోతలు తప్ప చేతల్లో ఏమీ లేదని ప్రజలకు అర్ధమైందన్నారు. ముఖ్యమంత్రి అంతులేని అవినీతి, ధన దాహానికి ప్రజలు బలై పోతున్నారని బోండా ఆవేదన వ్యక్తం చేశారు.

టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని బోండా ఉమ స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్ల పేరుతో తుప్పు పట్టిన మీటర్లు షిర్డి సాయి ఎలక్ట్రికల్ కంపెనీ వద్ద కొంటున్నారని, ఇది కూడా సీఎం సోదరుడు అవినాష్ రెడ్టి సంస్థే కాదా అని అన్నారు. పది వేలు విలువ చేసే స్మార్ట్ మీటర్లు రూ. 38వేలకు కొని.. తమ్ముడికి కూడా దోచి పెడుతున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ధన దాహంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు తారుమారయ్యాయన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని బోండా ఉమ స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-11T13:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising