ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన ఆయన అవినీతి పరుడుకాదు

ABN, First Publish Date - 2023-09-06T16:22:20+05:30

విజయవాడ: సీఎం జగన్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి, చంద్రబాబుకు తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత అవినీతి పరుడు కాదని, సాక్షి మీడియా విషప్రచారం చేస్తేనో, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు తప్పు చేసినట్టుకాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

విజయవాడ: సీఎం జగన్ రెడ్డి (CM Jagan) ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ (Lobbying) చేసి, చంద్రబాబు (Chandrababu)కు తప్పుడు నోటీసులిప్పించినంత మాత్రాన టీడీపీ అధినేత అవినీతి పరుడు కాదని, సాక్షి మీడియా విషప్రచారం చేస్తేనో, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తేనో చంద్రబాబు తప్పు చేసినట్టుకాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) అన్నారు. బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డి నీతిమాలిన చరిత్ర విషపు మీడియా, బ్లూమీడియా, వైసీపీ నేతలకు తప్ప దేశమంతా తెలుసునని అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ మచ్చా, ఎలాంటి అవినీతి మరక లేని ఏకైక నాయకుడు దేశంలో చంద్రబాబు ఒక్కరేనని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు వచ్చిన ఐటీ నోటీసులపై (IT Notices) సమాధానం (Reply) ఇవ్వడం జరిగిందని, బాబు వద్ద గతంలో పీఎస్‌గా పనిచేసిన శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ సోదాలపై అప్పుడే అసెస్‌మెంట్ ఆర్డర్ ఇవ్వడంతో ఐటీ విభాగం సంతృప్తి చెందిందని బోండా ఉమ అన్నారు. ఏమీ లేనిదాన్ని ఉన్నట్టు చిత్రీకరిస్తూ, విషప్రచారంతో ప్రజల్ని నమ్మించడం జగన్ రెడ్డికి, అతని కుటుంబానికి బాగా అలవాటేనని విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు అవినీతి చేశారంటూ హౌస్ కమిటీలు వేసి, ఏమీ నిరూపించలేక భంగపడ్డారన్నారు. జగన్ తల్లి విజయమ్మ కోర్టుల్లో కేసులు వేసి, ఆధారాలు చూపలేక వాటిని వెనక్కు తీసుకున్నారని, ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు రూ. 6 లక్షల కోట్ల అవినీతి చేశారని, తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించిన జగన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో ఏం నిరూపించారని ప్రశ్నించారు. ప్రజల్లో తనపై పెరుగుతున్న ఈర్ష్యా ద్వేషాలను కప్పిపుచ్చడానికే జగన్ రెడ్డి.. చంద్రబాబుకు ఐటీ నోటీసులని దుష్ప్రచారం మొదలెట్టారని మండిపడ్డారు. అవినీతి పునాదులపై పుట్టిన వైసీపీ.. దోపిడీ సొమ్ము నుంచి పుట్టిన సాక్షి మీడియా.. చంద్రబాబు, టీడీపీపై దుష్ప్రచారంతో శునకానందం పొందుతోందని బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Updated Date - 2023-09-06T16:22:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising