Bonda Uma: మద్యంలో రూ. 50 వేల కోట్లు దోచారు: బోండా ఉమ
ABN, First Publish Date - 2023-08-29T14:01:53+05:30
విజయవాడ: వైసీపీ నాయకులు చేస్తున్న ఇసుక దోపిడీపై నిరసన తెలుపుతూ మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ఇసుక సత్యాగ్రహ దీక్ష చేపట్టారు.
విజయవాడ: వైసీపీ నాయకులు (YCP Leaders) చేస్తున్న ఇసుక దోపిడీ (Sand Mining)పై నిరసన తెలుపుతూ మంగళవారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswararao) ఆధ్వర్యంలో ధర్నాచౌక్‌లో ఇసుక సత్యాగ్రహ దీక్ష (Sand Satyagraha Initiation) చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలు (Activists) హాజరయ్యారు. ఈ సందర్బంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుకను బంగారం చేశారని, ఇసుకలో వైసీపీ నేతలు (YCP Leaders) రూ. 40 వేల కోట్లు దోసేశారని ఆరోపించారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీకి నిరసనగా 66 ఇసుక రీచ్‌లలో నిరసన కార్యక్రమాలు చేశామన్నారు.
మద్యంలో రూ. 50 వేల కోట్లు దోచారని, కూరగాయల బండ్ల వద్ద కూడా ఆన్ లైన్ పేమెంట్లు ఉంటే మద్యం షాపులో ఎందుకు ఉండటం లేదని బోండా ఉమా ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య మంత్రి మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. ఒక బటన్ ద్వారా పది రూపాయలు ఇస్తూ.. ఇంకో బటన్ ద్వారా వంద రూపాయలు లాగేస్తున్నారని బోండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.
Updated Date - 2023-08-29T14:01:53+05:30 IST