ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబుకి గన్నవరంలో మరోసారి బ్రహ్మరథం పట్టిన ప్రజలు

ABN, First Publish Date - 2023-12-01T17:44:58+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చంద్రబాబు వచ్చారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి ( Nara Chandrababu Naidu ) కి గన్నవరం ( Gannavaram ) నియోజకవర్గ ప్రజానీకం మరోసారి బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం నాడు తిరుపతి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకి చంద్రబాబు వచ్చారు. అయితే గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కేసరపల్లి గూడవల్లి , నిడమానూరు, ఎనికెపాడు, ప్రసాదంపాడులో చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. రోడ్లు మీదకు వచ్చి చంద్రబాబుకు మహిళలు సంఘీభావం తెలిపారు. గన్నవరం నియోజకవర్గ ప్రసాదంపాడులో జన ఉత్సాహం ఉప్పొంగిపోయింది. చంద్రబాబును చూసేందుకు మహిళలు, ప్రజలు రోడ్లమీదకి పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుని మహిళలు, తెలుగు తమ్ముళ్లు పూలతో ముంచెత్తారు. గన్నవరం నుంచి రామవరప్పాడు రావడానికి నాలుగు గంటల సమయం పట్టింది.

ప్రతి గ్రామంలో చంద్రబాబు మీద స్థానిక గ్రామస్తులు పూల వర్షం కురిపిస్తున్నారు. గన్నవరం వద్ద జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఆగిపోయాయి. చంద్రబాబును చూసేందుకు భారీగా వాహనాల్లో ప్రజలు తరలి రావడంతో పోలీసులు చేతులు ఎత్తివేశారు. చంద్రబాబు కన్వెని వేగంగా వెళ్లాలని చంద్రబాబు, యార్లగడ్డ వెంకట్రావు వద్దకు స్వయంగా వెళ్లి పోలీసులు విజ్ఞప్తి చేశారు. పోలీసుల విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించినప్పటికీ రోడ్లపై పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి రావడంతో వావనాలు ముందుకు వెళ్లళ్లేని పరిస్థితి కనిపించింది.

Updated Date - 2023-12-01T17:52:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising