CPM Baburao: వంట గ్యాస్‌ను పెంచడం దుర్మార్గం
ABN, First Publish Date - 2023-03-01T15:55:10+05:30
వంట గ్యాస్‌ను (Cooking gas) పెంచడం దుర్మార్గం అని సీపీఎం బాబూరావు (CPM Baburao) మండిపడ్డారు. గ్యాస్
విజయవాడ: వంట గ్యాస్‌ను (Cooking gas) పెంచడం దుర్మార్గం అని సీపీఎం బాబూరావు (CPM Baburao) మండిపడ్డారు. గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా.. ఇండియా (India) లో మాత్రం ధరలు పెంచుతున్నారు. గతంలో నాలుగు వందలు సబ్సిడీ వేసేవారు.. ఇప్పుడు అన్నీ అదానీకి దోచి పెడుతున్నారు. గ్యాస్ బండ అంటే పేదలకు గుది బండగా మార్చారు. పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel), గ్యాస్ ధరల పెంపుతో అన్నీ పెరుగుతాయి. వీటని ప్రశ్నించకుండా మత విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు. మోడీ మాయలు, మోసాలను ప్రజలు గుర్తింంచారు. మోడీ (MODI) కి తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తాం. ఏపీలో ఉన్న జగన్ (Jagan), చంద్రబాబు (Chandrababu), పవన్ కళ్యాణ్‌లు (Pawan Kalyan) కూడా మోడీ చర్యలను ప్రశ్నించాలి. మోడీ పక్షమా, ప్రజల పక్షమా తేల్చుకోవాలి. వామపక్ష పార్టీలు ఆందోళనతో కలిసి నడవాలి.’’ అని బాబూరావు కోరారు.
ఇది కూడా చదవండి: ఓటమి భారం.. దానికి తోడు పక్కనున్నవాళ్లు నవ్వారని అవమాన భారం.. భరించలేక అతడు ఎంతకు తెగించాడంటే..
Updated Date - 2023-03-01T15:55:19+05:30 IST