ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP MLC Results: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ.. అధికారులు ఎలా ప్రవర్తించారంటే..

ABN, First Publish Date - 2023-03-18T12:22:25+05:30

ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో (AP MLC Elections) టీడీపీ అభ్యర్థులు (TDP Candidates) విజయకేతనం ఎగురవేశారు. రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో (Rayalaseema East Graduate Constituency Election) టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ (TDP candidate Kancharla Srikanth), ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక (MLC election of Uttarandhra graduates)ల్లో టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు (TDP candidate Vepada Chirajeevi Rao) విజయదుందుభి మోగించారు. అయితే కౌంటింగ్ పూర్తైనప్పటికీ ఫలితాలు ప్రకటించడంలో అధికారులు కాలయాపన చేశారు. చివరకు ఈసీ (Election Commission) ఆదేశాలతో ఇద్దరు టీడీపీ అభ్యర్థులకు అధికారులు డిక్లరేషన్ (Declaration) పత్రాన్ని అందజేశారు.

రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో 34,108 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత 50 శాతం +1 ఓటుతో 1,24,181 ఓట్లు సాధించారు. శ్రీకాంత్‌కు ఆ ఓట్లు వచ్చే సమయానికి వైసీపీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి. దీంతో 34,110 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. అయితే ఫలితాలు ప్రకటించడంలో అధికారులు జాప్యం చేశారు. కౌంటింగ్ సెంటర్‌లో టీడీపీ అభ్యర్థి ఉన్నా ఫలితం ప్రకటించకుండా అధికారులు వెళ్లిపోయారు. రాత్రి నుంచి డిక్లరేషన్ ఇవ్వకుండా కాలయాపన చేశారు. చివరకు ఈసీ ఆదేశంతో శ్రీకాంత్ గెలుపును అధికారులు ధృవీకరించారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ గడ్డపై తెలుగుదేశం పార్టీ (TDP Party) జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనం ముందు వైసీపీ (YCP) నిలబడలేందన్నారు. వైసీపీ దొంగ ఓట్లు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినా తామే గెలుస్తామని ఆనాడే చెప్పామని తెలిపారు. తమ ఏజెంట్లను బూతుల్లో కూచ్చోనివ్వకుండా దాడులకు పాల్పడినా, ఎన్ని అక్రమాలకు పాల్పడిన 38వేల మెజారిటీతో గెలిచి చూపించామని అన్నారు. 2024 లేదా అంతకన్నా ముందు ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టీడీపీ దే ఘన విజయం అని.. చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 150 నుంచి 160 సీట్లలో ఘనవిజయం సాధిస్తుందన్నారు. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) చేస్తున్న నారా లోకేష్‌ (NaraLokesh)కు ఈ ఘన విజయాన్ని అంకితం చేస్తున్నామని శ్రీకాంత్ తెలిపారు.

చిరంజీవి రావు గెలుపు...

మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. అయితే కౌంటింగ్ పూర్తి అయినప్పటికీ డిక్లరేషన్ విషయంలో సస్పెన్స్ కొనసాగింది. ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ అనుమతితో చిరంజీవి రావుకు రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు.

రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కించినప్పుడు పోటీదారుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన (చివరి నుంచి) అభ్యర్థి బ్యాలెట్లను తీసి రెండో ప్రాధాన్య ఓట్లను లెక్కిస్తారు. అలా ఆ తరువాత అతనిపైనున్న అభ్యర్థి...ఆ తరువాత ఇంకొకరి రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలోకి తీసుకుంటారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు విజయానికి అవసరమైన ఓట్లు 11,551. పోటీ చేసిన 37 మందిలో 34 మందికి డిపాజిట్లు దక్కలేదు. వారిలో 33 మందికి కలిసి సుమారు వేల ఓట్లు వచ్చాయి. అధికారులు వాటన్నింటినీ కలిపేసి...ద్వితీయ ప్రాధాన్య ఓట్లు లెక్కించగా టీడీపీ అభ్యర్థికి 786 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత బీజేపీ అభ్యర్థి మాధవ్‌కు వచ్చిన 10,884 ఓట్లలో రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపును రాత్రి పది గంటల సమయంలో ప్రారంభించారు. ఇందులో టీడీపీ 3,000, వైసీపీకి 1,360 ఓట్లు లభించాయి. దాంతో పీడీఎఫ్‌ అభ్యర్థిని కోరెడ్ల రమాప్రభ ఓట్ల నుంచి తొలుత 15,100 తీసుకున్నారు. అందులో టీడీపీకి 6,678 ఓట్లు రాగా, వైసీపీకి 2,025 వచ్చాయి. అప్పటికి అవసరమైన 11,551 ఓట్లు రావడంతో టీడీపీ అభ్యర్థి చిరంజీవి రావు గెలిచినట్టుగా అధికారులు ధ్రువీకరించారు. అయితే రాత్రి 12.30 గంటల సమయానికి అధికారికంగా ప్రకటించలేదు. ఈరోజు ఉదయం టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లుగా అధికారికంగా ప్రకటించి.. డిక్లరేషన్‌ను అందజేశారు.

Updated Date - 2023-03-18T12:40:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising