Devineni Uma: తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం..
ABN, First Publish Date - 2023-12-06T12:14:28+05:30
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాధుడే లేడని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
అమరావతి: మిచౌంగ్ తుఫాన్ సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాష్ట్ర ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాధుడే లేడని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. బాధితులకు వసతి, భోజనం ఏర్పాటు చేయలేని ప్రభుత్వం ఎందుకన్నారు. హుద్ హుద్ లాంటి మహాప్రళయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రజలకు అండగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హుద్ హుద్, తితిలీ తుపాను వల్ల బాధితులకు నాటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పరిహారాన్ని జగన్ సర్కార్ తగ్గించడం దుర్మార్గమన్నారు. కష్టాలలో ఉన్న ప్రజలను పరామర్శించే తీరిక లేని సీఎం జగన్ తాడేపల్లిలో పబ్జి ఆడుకుంటున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు.
కాగా విజయవాడ ప్రకాశం బ్యారేజికు భారీగా వరద నీరు చేరింది. 12 అడుగుల గరిష్ఠ నీటి మట్టం దాటి నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు పది గేట్లు అడుగు మేర ఎత్తి 5,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా బ్యారేజికు వరదనీరు చేరుతోంది.
Updated Date - 2023-12-06T12:14:30+05:30 IST