Rajendra Prasad: సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించకపోతే సీఎం ఇంటిని ముట్టడిస్తాం
ABN, First Publish Date - 2023-07-14T15:02:01+05:30
రెండు రోజుల పాటు ఏపీ పంచాయితీ రాజ్ చాంబర్ &ఏపీ సర్పంచులు సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాం. మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. మా సర్పంచుల డబ్బులు ప్రభుత్వం దొంగతనం చేసింది. ఈనెల 17న అన్ని జిల్లా ఎస్పీలకు దోపిడీపై ఫిర్యాదు చేస్తాం. సీబీసీఐడి విచారణకు డిమాండ్ చేస్తాం. 24, 27 స్పందన కార్యక్రమంలో మా 12 డిమాండ్స్ పై కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తాం.
విజయవాడ: సర్పంచ్‌ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకోవడం లేదని ఏపీ పంచాయితీ రాజ్ చాంబర్ వ్యవస్థాపక అధ్యక్షులు వైవీబీ. రాజేంద్రప్రసాద్ (Y.V.B.Rajendra Prasad) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రెండు రోజుల పాటు ఏపీ పంచాయితీ రాజ్ చాంబర్ &ఏపీ సర్పంచులు సంఘం ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించాం. మా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. మా సర్పంచుల డబ్బులు ప్రభుత్వం దొంగతనం చేసింది. ఈనెల 17న అన్ని జిల్లా ఎస్పీలకు దోపిడీపై ఫిర్యాదు చేస్తాం. సీబీసీఐడి విచారణకు డిమాండ్ చేస్తాం. 24, 27 స్పందన కార్యక్రమంలో మా 12 డిమాండ్స్ పై కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తాం. ఉపాధి హామీ నిధులు గతంలో మాదిరి ఇవ్వాలి. గౌరవ వేతనం పెంచాలి. పార్లమెంట్ సమావేశాల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాం. కేంద్ర గ్రామ పంచాయతీ శాఖ దృష్టికి మా వందల కోట్ల రూపాయల దోపిడీని తీసుకుని వెళ్తాం. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఛలో అసెంబ్లీని ముట్టడిస్తాం. విశాఖలో ఉన్న పంచాయతీ రాజ్ మినిస్టర్ ఇంటిని ముట్టడిస్తాం. బుగ్గన రాజేంద్రనాధ్ ఇంటిని కూడా ముట్టడిస్తాం. విద్యుత్ బిల్లుల దోచేస్తున్న విద్యుత్ శాఖకు కూడా కరెంట్ షాక్ ఇస్తాం. విద్యుత్ శాఖపై పన్నులు వేస్తాం. మా పంచాయతీ పరిధిలో కరెంట్ పోల్స్, కరెంటు లైన్స్ వేస్తున్నందుకు మేము వసూలు చేస్తాం. రిలే నిరాహార దీక్షలు చేస్తాం. పార్టీలకు అతీతంగా సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి(CM Jagan) ఇంటిని ముట్టడిస్తాం.’’ అని రాజేంద్రప్రసాద్ ప్రకటించారు.
Updated Date - 2023-07-14T15:02:01+05:30 IST