ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఆహ్వాన పత్రిక ఇచ్చేందుకు వెళ్లిన వైసీపీ నేత... చుక్కలు చూపిన సీఐ

ABN, First Publish Date - 2023-02-10T12:32:31+05:30

వివాహ ఆహ్వాన కార్డు ఇచ్చేందుకు వెళ్లిన వైసీపీ నేతకు గన్నవరం సీఐ కనకారావు చుక్కలు చూపించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: వివాహ ఆహ్వాన కార్డు ఇచ్చేందుకు వెళ్లిన వైసీపీ నేత (YCP Leader)కు గన్నవరం సీఐ కనకారావు (Gannavaram CI Kanaka Rao)చుక్కలు చూపించాడు. వైసీపీ పార్టీ కార్డు ఉందా అంటూ ఎగతాళిగా మాట్లాడాడు. వైసీపీ నేత పట్ల అవమానకరంగా ప్రవర్తించడంతో ఆహ్వాక కార్డు ఇవ్వకుండానే ఆ నేత వెనుదిరిగాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.

అసలేం జరిగిందంటే... వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు పడమట సురేష్ (YCP mandal party president Padamata Suresh) శుభకార్య ఆహ్వానం కార్డు ఇచ్చేందుకు గన్నవరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే సీఐ కనకారావుకు వివాహ ఆహ్వానం కార్డు ఇచ్చే తరుణంలో పడమట సురేష్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తాను వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడి అంటూ సీఐకు సురేష్‌ పరిచయం చేసుకున్నాడు. అయితే వైసీపీ పార్టీ కార్డు ఉందా?... కార్డు ఉంటే చూపించు అని మండల పార్టీ అధ్యక్షుడిని సీఐ ఎగతాళి చేశాడు. సురేష్ పట్ల అవమానకరంగా ప్రవర్తించాడు. దీంతో శుభకార్యం కార్డు ఇవ్వకుండానే వైసీపీ నేత వెనుతిరిగాడు. అయితే అతనిని లోపలికి ఎవరు పంపారని స్టేషన్ సిబ్బందిపై సీఐ కనకారావు పెద్ద పెద్ద కేకలు వేశారు. ఈ గందరగోళం చూసి సురేష్ అవాక్కయ్యాడు. తన పట్ల సీఐ కనకారావు చిన్నచూపు చూడడంతో అవమానభారంతో స్టేషన్ ఆవరణ నుంచి మండల పార్టీ అధ్యక్షుడు సురేష్ బయటకు వచ్చేశాడు. వైసీపీ నేతల పట్ల సీఐ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఐ ప్రవర్తనపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-02-10T12:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising