Chandrababu CID Court: సీఐడీ తరపున సుధాకర్‌రెడ్డి ఏం వాదించారంటే..!

ABN , First Publish Date - 2023-10-04T15:36:03+05:30 IST

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ తరపును న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విపించారు.

Chandrababu CID Court: సీఐడీ తరపున సుధాకర్‌రెడ్డి ఏం వాదించారంటే..!

విజయవాడ: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. చంద్రబాబు తరపున ప్రమోద్ దూబే వాదనలు వినిపించారు. సీఐడీ తరపును న్యాయవాది, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు విపించారు.

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు..

‘‘చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి. స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉంది. దర్యాప్తునకు కీలకంగా ఉన్న దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం సరికాదు. చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. స్కిల్ కుంభకోణంలో రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారు. 21-07-2017లోనే రూ.371 కోట్ల నిధులకు పన్నుల ఎగవేతపై జీఎస్టీ.. ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 05-01-2018న ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతో పాటు సీబీఐని విచారించాలని జీఎస్టీ కోరింది. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 26-07-2018న 17ఏ సవరణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి 17ఏ వర్తించదు.’’ అని పొన్నవోలు వాదనలు వినిపించారు.

Updated Date - 2023-10-04T15:36:03+05:30 IST