ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Janasena: అరాచకాలకు కేరాఫ్‌‌గా పేర్నినాని..

ABN, First Publish Date - 2023-09-05T21:33:45+05:30

మచిలీపట్నంలో వైసీపీ(YCP in Machilipatnam) అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని జనసేన నేత కొరియర్ శ్రీను(Courier Srinu) అన్నారు. మంగళవారం నాడు జనసేన(Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతలు పేర్ని నాని(Perni Nani), అతని కొడుకు కలిసి కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు.

కృష్ణా: మచిలీపట్నంలో వైసీపీ(YCP in Machilipatnam) అరాచకాలకు హద్దే లేకుండా పోతోందని జనసేన నేత కొరియర్ శ్రీను(Courier Srinu) అన్నారు. మంగళవారం నాడు జనసేన(Janasena) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నేతలు పేర్ని నాని(Perni Nani), అతని కొడుకు కలిసి కుల విద్వేషాలు రెచ్చ గొడుతున్నారు.ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను జీర్ణించుకోలేక దిగజారి వ్యవహరిస్తున్నారు. అరాచాకాలకు కేరాఫ్‌‌గా పేర్నినాని ఉన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జనసైనికులు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ కొడుకుగా వచ్చిన జగన్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు చెబుతున్నారు.తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్లు దోచుకున్నాడు. జగన్ మాయ మాటలు నమ్మి మంచి పాలన అందిస్తాడని ప్రజలు నమ్మారు.జనసేనను ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము లేని పేర్ని నాని కుట్రలకు పాల్పడుతున్నాడు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా, ప్రజలు కొట్టుకోవాలని పేర్నినాని బ్యానర్లు కట్టించారు. మీ మాయలో పడి మోసపోవడానికి ప్రజలు సిద్దంగా లేరు. నీ కొడుకు కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిగ్గుండాలి. జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కులాల మధ్య చిచ్చుపెట్టే ఫ్లెక్సీలు కడతారా..? ఆ బ్యానర్లు మీరే చింపుకుని.. నిందలు మా మీద వేస్తారా... సిగ్గుందా..?నానీ..నీ కొడుకు చేసే అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. నీ కుల రాజకీయాలకు ప్రజలే బుద్ది చెబుతారు. డబ్బు, అధికార మదంతో నీ కొడుకు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వెధవలను ఓడించి ప్రజలు ఇంటికి పంపాలి’’ అని కొరియర్ శ్రీను పేర్కొన్నారు.

పేర్ని నానీ... కుట్రలు మానుకుని, ప్రజలకు మంచి చేసే పనులు చేయాలని జనసేన నేత బండి రామకృష్ణ హితవు పలికారు.‘‘నీ అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తారా. మా మీద కుట్రలు చేసి... ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించాలని చూస్తున్నారు. ఇటువంటి కుట్రలను ఎంతో కాలంగా చూశాం. దాడులు, దౌర్జన్యాలు చేసేది మీరు.. బాధితులపై మాత్రం కేసులా?. ఒక ఫ్లెక్సీ మీద జరిగిన గొడవపై మా పార్టీ కార్యాలయం మీదకు వస్తారా. మేమంతా మీ వైసీపీ కార్యాలయం మీదకు వస్తే తట్టుకోగలరా. మీ కుట్రలను ముందే మా అధినేత పవన్ కళ్యాణ్ గ్రహించి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇప్పుడు అయినా నానీ.. నీ మనుషులను అదుపులో పెట్టుకో..కాదని రెచ్చగొడితే.. తేల్చుకునేందుకు మేము కూడా సిద్దంగానే ఉన్నాం’’ అని బండి రామకృష్ణ హెచ్చరించారు.

Updated Date - 2023-09-05T22:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising