ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kollu Ravindra: 20 అడుగుల జైలు గోడలు చంద్రబాబుకు రక్షణ ఇస్తాయా..?

ABN, First Publish Date - 2023-09-13T14:17:14+05:30

మచిలీపట్నం (కృష్ణాజిల్లా): టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రాణ హాని ఉందని, 20 అడుగుల జైలు గోడలు ఆయనకు రక్షణ ఇస్తాయా..? అంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.

మచిలీపట్నం (కృష్ణాజిల్లా): టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు (Chandrababu)కు రాజమండ్రి (Rajahmundry) సెంట్రల్ జైలు (Central Jail)లో ప్రాణ హాని ఉందని, 20 అడుగుల జైలు గోడలు ఆయనకు రక్షణ ఇస్తాయా..? అంటూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర (Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ జైళ్లలో హై సెక్యూరిటీ ఉంటే మొద్దు శ్రీను ఎలా చనిపోయాడని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఏ చిన్న హాని జరిగినా రాష్ట్రాన్ని స్థంభింప చేస్తామని హెచ్చరించారు.

చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైలే హైసెక్యూరిటీ అన్న ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురం జైలులో ఉన్న మొద్దు శీను పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు కేటాయించిన స్నేహ బ్లాక్‌పై కూడా రవీంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు. స్నేహా బ్లాక్ పేరుకే వీఐపీ (VIP) బ్లాక్ అని.. అదే స్నేహ బ్లాక్‌లో చేయని నేరానికి తాను కూడా రిమాండ్‌లో ఉండి వచ్చానన్నారు. స్నేహ బ్లాక్‌లో కనీస వసతులు ఉండవని, స్నానానికి వేడి నీళ్లు ఇవ్వరని, ట్యాప్ వాటరే తాగాల్సిన పరిస్థితులు అక్కడ ఉంటాయని కొల్లు రవీంధ్ర పేర్కొన్నారు.

Updated Date - 2023-09-13T14:17:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising