ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna SP: గన్నవరంలో వైసీపీ దుశ్చర్యను సమర్థించిన కృష్ణా జిల్లా ఎస్పీ.. పట్టాభిదే తప్పన్నట్టుగా..

ABN, First Publish Date - 2023-02-21T11:42:19+05:30

గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ కార్యకర్తల దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: గన్నవరంలో టీడీపీ కార్యాలయం (Gannavaram TDP Office)పై వైసీపీ కార్యకర్తల దాడులపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా (Krishna District SP Joshua) స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో ఈరోజు టీడీపీ శ్రేణుల చలో గన్నవరం కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేశారు. టీడీపీ నేత పట్టాభి (TDP Leader Kommareddy Pattabhi).. విధులు నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడికి పురిగొల్పడం, బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం వల్లే శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైందన్నారు. దీనివల్ల విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకారావు తలకు బలమైన గాయమైందని ఎస్పీ తెలిపారు.

పట్టాభి తొందర పాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని విమర్శించారు. టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నామన్నారు. సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 సీఆర్‌పీసీ, 30 పోలీస్ ఆక్ట్ అమల్లో ఉందని తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఏ విధమైన సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలులేదన్నారు. గన్నవరం పరిసర ప్రాంతాలకు ఎవరు ప్రవేశించకుండా చెక్‌పోస్టులు, పికెట్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా అక్రమంగా ప్రవేశించాలని చూస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఎస్పీ జాషువా కోరారు.

Updated Date - 2023-02-21T11:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising