MLC Election: అప్పలనాయుడు ఓటుతో ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
ABN, First Publish Date - 2023-03-23T14:37:46+05:30
నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
అమరావతి: నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు (Nellimarla YCP MLA Appalanaidu) ఓటుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLA Quota MLC Election) పోలింగ్ ముగిసింది. కుమారుడి వివాహం కారణంగా అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటు వేశారు. వివాహం అనంతరం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అప్పలనాయుడు కోసం వైసీపీ చాపర్‌ను పంపించింది. విశాఖ నుంచి గన్నవరంకు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) చేరుకున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ (AP Assembly)కి చేరుకుని ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు. దీంతో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం 5 గంటలకు కౌంటిగ్ ప్రక్రియ మొదలు కానుంది.
ఈరోజు ఉదయం 9 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తరువాత ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) నారాయణస్వామి (Narayana swamy), రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath), ఉషశ్రీ చరణ్ (Usha sri Charan), దాడిశెట్టి రాజా (Dadisetti Raja), ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు (Namburi Shankar Rao), మేకతోటి సుచరిత (Mekatoti Sucharita) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలా ఒక్కొక్కరుగా వైసీపీ ఎమ్మెల్యేలు అంతా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అసెంబ్లీకి వచ్చి ఓటే వేశారు. చంద్రబాబుతో పాటు నందమూరి బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు వీల్ చెయిర్‌లో వచ్చి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి, నిమ్మలరామానాయుడు, అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇలా తెలుగు దేశంకు చెందిన ఎమ్మెల్యేలు అంతా ఒకేసారి వచ్చి ఓటు వేశారు.
Updated Date - 2023-03-23T14:39:16+05:30 IST