Parliament: రాజ్యసభలో వంగవీటి రంగా ప్రస్తావన...

ABN , First Publish Date - 2023-02-13T15:04:48+05:30 IST

రాజ్యసభలో దివంగత నేత వంగవీటి మోహన రంగా పేరు ప్రస్తావనకు వచ్చింది.

Parliament: రాజ్యసభలో వంగవీటి రంగా ప్రస్తావన...

న్యూఢిల్లీ: రాజ్యసభలో దివంగత నేత వంగవీటి మోహన రంగా (Late leader Vangaveeti Mohana Ranga) పేరు ప్రస్తావనకు వచ్చింది. విజయవాడ (Vijayawada) లేదా మచిలీపట్నం (Machilipatnam) జిల్లాల్లో ఒకదానికి ఆయన పేరు పెట్టాలని పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని (AP Government) బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు (BJP MP GVL Narasimha Rao) డిమాండ్ చేశారు. దివంగత కాపు నాయకుడు, పేద ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొంది ముష్కరుల చేతిలో రాజకీయ హత్యకు గురైన వంగవీటి రంగా గొప్పతనాన్ని పార్లమెంటులో ఎలుగెత్తి చాటాలన్నారు. ఇతర నాయకుల పేర్లు జిల్లాలకు పెట్టిన వైసీపీ ప్రభుత్వాని (YCP Government) కి వంగవీటి మోహన రంగా పేరు పెట్టడానికి ఎందుకు మనస్కరించలేదని నిలదీశారు. ప్రజల పెన్నిధిగా ఎదిగాడన్న కారణంగానే వంగవీటిని హతమార్చారని ఆరోపించారు. ఇంకా అనేక అంశాలు ప్రస్తావించిన బీజేపీ ఎంపీ... విజయవాడ ఎయిర్పోర్ట్‌ (Vijayawada Airport) కు వంగవీటి మోహన రంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని (Central Government) కోరారు.

Updated Date - 2023-02-13T15:04:59+05:30 IST