ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Raghurama: దరిద్రపు ప్రభుత్వం అరు నెలల్లో పోతుంది

ABN, First Publish Date - 2023-09-15T14:48:09+05:30

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో జరుగుతున్న ఘోరాలను వివరించానని, చంద్రబాబును కక్ష పూరితంగా ఏ విధంగా జైల్లో పెట్టారో చెప్పడం జరిగిందన్నారు.

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ (Rajnath Singh)ను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghurama Krishnamraju) కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ (Jagan) పాలనలో జరుగుతున్న ఘోరాలను వివరించానని, చంద్రబాబు (Chandrababu)ను కక్ష పూరితంగా ఏ విధంగా జైల్లో పెట్టారో చెప్పడం జరిగిందన్నారు. తనకు తెలిసిన వివరాలు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించానన్నారు. సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందన్నారు. ఇంటర్నల్ సివిల్ వార్ వచ్చే అవకాశం ఉందని చెప్పానన్నారు. అయితే చంద్రబాబు అంశం ఇప్పటికే కేంద్రం దృష్టికి వచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ (Skill Development) స్కీమ్‌లో స్కాం క్రియేట్ చేసిన వారిలో ఐఏఎస్ అధికారి సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నారని, పొన్నవోలు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించడం లేదని, వైసీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని రఘురామ మండిపడ్డారు. సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోటీ పడి మరీ ప్రెస్ మీట్ ఇచ్చారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏమి లేదని, ఆ ఫైల్ మాయం చేశారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ గుజరాత్‌లో పెట్టారని, మరి మోదీ నిజాయితీని ప్రశ్నిస్తారా? అని అన్నారు. ప్రేమ్ చంద్రారెడ్డిని ఎందుకు విచరించాలేదు?.. నిధులు విడుదల చేయాలని ఆదేశించింది ప్రేమ్ చంద్రారెడ్డి అని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ఫైల్ కొట్టేసింది సునీల్ కుమార్ గ్యాంగని అన్నారు. అదొక అద్భుతమైన స్కీమ్ అని.. స్కిల్ డెవలప్‌మెంట్‌కు అవార్డులు వస్తే సీఎం జగన్ ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఏ రకంగా చెల్లదని, అందుకే వాయిదాలు అడుగుతున్నారని, దరిద్రపు ప్రభుత్వం అరు నెలల్లో పోతుందన్నారు. తెలంగాణలో ఐటీ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చినంత మాత్రాన ఏమి కాదని రఘురామ అన్నారు.

వైసీపీ అంతానికి ఆరంభం మొదలైందని, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో తమ వాళ్ళు కొందరు ముందుకు వచ్చారని రఘురామ అన్నారు. అన్ని మారితే విజయసాయిరెడ్డి చంద్రబాబు దగ్గర చేరిపోతారని జోష్యం చెప్పారు. నిన్నటితో వైసీపీ పతనం ప్రారంభం అయిందన్నారు. టీడీపీ, జనసేన పొత్తు చెడగొట్టాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని, సాక్షి పేపర్ మాత్రమే కొనాలని పెట్టిన నిబంధనలకు జగన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చిందన్నారు. పోలీసులు రాజ్యాంగ పరిధిలో ఉంటే మంచిదని రఘురామ సూచించారు.

Updated Date - 2023-09-15T14:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising