ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Payyavula: ఏడాది కాలంగా జగన్ ఆస్తుల కేసు ఎందుకు రావడం లేదు?..

ABN, First Publish Date - 2023-09-21T14:24:47+05:30

అమరావతి: ములాకాత్.. మిలాఖత్‌లతోనే పుట్టిన పార్టీ వైకాపా కదా..? ఢిల్లీకి సీఎం వెళ్లి ఎవరితో ములాఖత్.. మిలాఖత్ అవుతున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.

అమరావతి: ములాఖత్.. మిలాఖత్‌లతోనే పుట్టిన పార్టీ వైకాపా కదా..? ఢిల్లీకి సీఎం జగన్ (CM Jagan) వెళ్లి ఎవరితో ములాఖత్.. మిలాఖత్ అవుతున్నారని ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ప్రశ్నించారు. గురువారం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ దశాబ్ద కాలంగా సీఎం జగన్ ఆస్తుల కేసు ప్రస్తావన రాకపోవడానికి ఏ ములాఖత్.. మిలాఖత్ కారణమని నిలదీశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. ఎవరైనా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తారని.. కానీ అరెస్ట్ చేసి ఆధారాలు సేకరిస్తామని సీఐడీ అధికారులు (CID Officers) నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.

టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) మాట్లాడుతూ 144 సెక్షన్, 30ఏ చట్టాలను అసెంబ్లీలోనూ సీఎం జగన్ అమలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అరెస్టుపై వాస్తవాలు తెలియాలంటే తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని కోరారు. అక్రమ కేసులో డొల్ల తనం బయటపడుతుందనే తమ పవర్ పాయింట్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వలేదన్నారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ డెంగ్యూ వ్యాధితో చనిపోయాడని అన్నారు. డెంగ్యూ వ్యాధితో ఖైదీ చనిపోవడంతో తమ అధినేత చంద్రబాబు భద్రత.. ఆరోగ్యంపై తమకు ఆందోళన ఉందని అచ్చెన్నాయుడు అన్నారు.

Updated Date - 2023-09-21T14:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising