ప్రజా భాగస్వామ్యంతో తట్టు నివారణ

ABN , First Publish Date - 2023-02-26T00:37:29+05:30 IST

ప్రజల భాగస్వామ్యంతోనే తట్టు వ్యాధిని నివారిం చగలమని బాపులపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎంజె. మంజూష తెలిపారు.

 ప్రజా భాగస్వామ్యంతో తట్టు నివారణ
బాపులపాడు సచివాలయంలో తట్టువ్యాధి నివారణ టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది

హనుమాన్‌జంక్షన్‌, ఫిబ్రవరి 25 : ప్రజల భాగస్వామ్యంతోనే తట్టు వ్యాధిని నివారిం చగలమని బాపులపాడు పీహెచ్‌సీ వైద్యాధికారి ఎంజె. మంజూష తెలిపారు. శనివారం బాపులపాడు పీహెచ్‌సీ ఆధ్వర్యంలో గ్రామ సచివాలయాల్లో తట్టు వ్యాధి నివారణ టీకాలు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా టీకాలు వేశారు. 2023 నాటికి తట్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించే దిశగా ప్రజల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు. తట్టువ్యాధి నివా రణపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామంలోని మూడు సచివాల యాల్లో నిర్వహిం చిన టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య కార్యాలయం ఏవో బి.శివ సాంబిరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో ఫణి కుమార్‌, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-26T00:37:31+05:30 IST