సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలి
ABN , Publish Date - Dec 28 , 2023 | 01:16 AM
ప్రజాకంటకుడు సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి హేమ పిలుపునిచ్చారు. బుధవారం తాడిగడప 11వ డివిజన్‌లో జరిగిన బాబుష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలతో మాట్లాడారు. తుఫానుకు రాష్ట్ర రైతాంగం పంట నష్టాలతో సమస్యల్లో కూరుకుపోతే ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ర్టాన్ని ఆటలాడిస్తాననడం జగన్ పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు.

పెనమలూరు, డిసెంబరు 27: ప్రజాకంటకుడు సైకో జగన్‌ను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సతీమణి హేమ పిలుపునిచ్చారు. బుధవారం తాడిగడప 11వ డివిజన్‌లో జరిగిన బాబుష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో ఆమె పార్టీ శ్రేణులతో కలిసి ప్రజలతో మాట్లాడారు. తుఫానుకు రాష్ట్ర రైతాంగం పంట నష్టాలతో సమస్యల్లో కూరుకుపోతే ఆడుదాం ఆంధ్రా పేరుతో రాష్ర్టాన్ని ఆటలాడిస్తాననడం జగన్ పిచ్చికి పరాకాష్టగా అభివర్ణించారు. భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను పంపిణీ చేశారు. బోడె హేమ వెంట తుమ్మల రేఖ, మేడసాని రత్నకుమారి, ఉప్పులూరు వరలక్ష్మి, బొల్లు నాగమణి, షకీలా, ప్రమీల, చదలవాడ సునీత, గడిపాటి అనురాధ, తుమ్మల రాంకుమార్, మన్నె రాజబాబు, పీతా గోపీచంద్ తదితరులు ఉన్నారు.
కానూరులో..
కానూరు సనత్‌నగర్‌లో జరిగిన బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ కృష్ణాజిల్లా ఉపాధ్యక్షుడు వెలగపూడి శంకరబాబు, టీడీపీ నాయకులు షేక్ రఫీ, షేక్ ఇక్బాల్, ఇమాం, రమేష్, వెంకటేశ్వరరావు, రియాజ్, రఫీ తదితరులు పాల్గొని మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి వచ్చే లబ్ధిని తెలిపే బాండ్లను పంచిపెట్టారు.
వైసీపీ పతనం ఖాయం
ఉయ్యూరు : రాష్ట్రంలో అరాచక, అవినీతి పాల నతో విసుగు చెందిన ప్రజలు తెలుగుదేశం, జనసే న కలయికతో ఏర్పడే ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని, త్వరలోనే వైసీపీ పతనం ఖాయమ ని టీడీపీ నాయకుడు దేవినేని గౌతమ్ అన్నారు. ఉయ్యూరు 11వ వార్డులో బుధవారం బాబు ష్యూ రిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించి చంద్రబాబునాయుడు ప్రకటించిన మినీమేనిఫెస్టో, అభివృద్ధి సంక్షేమానికి సంబంధిం చిన పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ విద్యుత్, బస్ చార్జీలు పెంచి సామాన్య మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచిన ప్రభుత్వం పెరిగిన నిత్యావసరాల ధరలు అరికట్టలేకపోవడంపట్ల ప్ర జలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు దేవినేని స్మిత, కోటయ్య, సాంబశివరావు, అబుసల్మాన్ పాల్గొన్నారు.