ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ayyannapatruduపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీం అనుమతి

ABN, First Publish Date - 2023-02-27T13:16:16+05:30

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (TDP Leader Ayyannapatrudu)పై ఫోర్జరీ కేసు (Forgery Case) దర్యాప్తునకు సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతినిచ్చింది. సోమవారం అయ్యన్న (TDP Leader)పై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ క్రమంలో అయ్యన్నపై ఫోర్జరీ కేసు దర్యాప్తునకు అనుమతినిస్తూ జస్టిస్‌ ఎంఆర్‌ షా (Justice MR Shah), జస్టిస్‌ సీటీ రవికుమార్‌ (Justice CT Ravikumar) ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఫోర్జరీ సెక్షన్ల ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని ఉన్నతన్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు (AP Highcourt) ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టివేసింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.

బిల్డింగ్‌ ప్లాను విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో అయ్యన్నపాత్రుడుపై ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన కేసును మెరిట్ ఆధారంగా విచారణ చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఫోర్జరీ చేసి... ఎన్‌ఓసీ తీసుకున్నారని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ అధికారి పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు విచారణ జరిపిన ధర్మాసనం ఫోర్జరీ కేసు దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. ఫోర్జరీ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది. సెక్షన్‌ 41 సీఆర్‌పీసీ ప్రకారమే విచారణ కొనసాగించాలని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ధర్మాసనం అనుమతినిచ్చింది. తన ఇల్లు నిర్మించే క్రమంలో నీటిపారుదల శాఖ అధికారి సంతకాలు ఫోర్జరీ చేశారని అయ్యన్నపాత్రుడుపై రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు మోపింది.

Updated Date - 2023-02-27T13:18:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising