ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HighTension: టీడీపీ, జనసేన మహాధర్నా.. అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2023-10-20T10:33:33+05:30

కృష్ణా జిల్లా అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు (శుక్రవారం) ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట మహా ధర్నాకు టీడీపీ, జనసేన పార్టీలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి హామీల సాధన కోసం వరుస నిరసనలతో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది.

కృష్ణా: కృష్ణా జిల్లా అవనిగడ్డలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేడు (శుక్రవారం) ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు (MLA Simhadri Ramesh babu) కార్యాలయం ఎదుట మహాధర్నాకు టీడీపీ (TDP), జనసేన (Janasena) పార్టీలు పిలుపునిచ్చాయి. ముఖ్యమంత్రి హామీల సాధన కోసం వరుస నిరసనలతో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. దీంతో ఎమ్మెల్యే కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan) అవనిగడ్డ వచ్చి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.93 కోట్ల వరాలు కురిపించి నేటికీ సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో హామీల అమలు ఎప్పుడు అంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కార్యాలయం ఎదుట మహా ధర్నాకు పిలుపు ఇచ్చాయి. 144 వ సెక్షన్ అమలులో ఉందని ధర్నాకు అనుమతులు లేవని పోలీసులు ఇప్పటికే మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ (Former Vice President Council Buddhaprasad) సహా నియోజకవర్గ తెలుగుదేశం నేతలకు నిన్ననే నోటీసులు జారీ చేశారు. ఈరోజు బుద్ధప్రసాద్ సహా పలువురు తెలుగుదేశం, జనసేన నేతలను ఇళ్ళ వద్ద నిర్బంధించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఇంటికి వెళ్ళే అన్ని దారుల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. వందల మందితో కూడిన ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.


అయితే పోలీసులు ఎన్ని అడ్డంకులు పెట్టినా మహాధర్నా నిర్వహించి తీరుతామని తెలుగుదేశం, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. సామాన్యుడు నిత్యావసరాల కోసం బయటకు రావాలన్నా పోలీస్ ఆంక్షలు తప్పకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ధర్నా అంటూ ఎవరైనా బయటకు వస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు నిన్న అవనిగడ్డ మండలం ఎడ్లంక వద్ద ఇరుపార్టీలు చేపట్టిన జల దీక్ష కార్యక్రమానికి అనూహ్య స్పందన రావడం అధికార పక్షానికి మింగుడు పడని అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన ఇరుపార్టీల ముఖ్య నేతలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా వారి ఇళ్ళ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడం, నిర్బంధాలు అధిగమించి కార్యకర్తలు అవనిగడ్డకు పెద్దసంఖ్యలో చేరుకుంటూ ఉండటంతో అవనిగడ్డలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-10-20T11:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising