ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: దొంగ ఓట్లతో గెలవాలని వైసీపీ చూస్తోంది

ABN, First Publish Date - 2023-08-21T15:39:11+05:30

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమమహేశ్వరరావు జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పెద్దఎత్తున టీడీపీ ఓట్లు తొలగించటానికి చూస్తోందన్నారు.

విజయవాడ: తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ (TDP Politburo Member) బోండా ఉమమహేశ్వరరావు (Bonda Umamaheswaararao), వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దొంగ ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, ఏపీలో పెద్దఎత్తున టీడీపీ ఓట్లు తొలగించటానికి చూస్తోందన్నారు. టీడీపీ అనుకూల, సానుభూతి పరుల ఓట్లను తొలగించటానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)ఆధ్వర్యంలో పెద్ద టీమ్ పనిచేస్తుందని ఆరోపించారు. టీడీపీ ఓట్లు తొలగించటానికి అధికారులను ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నారని బోండా ఉమ విమర్శించారు.

వైసీపీ చెప్పినట్లు చేసి అనంతపురం జెడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యారని, పాత జెడ్పీ సీఈవో శోభస్వరూపా కూడా సస్పెండ్ అయ్యారని బోండా ఉమ అన్నారు. త్వరలో వారిని అరెస్టు చేస్తారన్నారు. వైసీపీ మాటలు విని తప్పుడు విధానాలతో ఓట్లు తొలగించే ఏ అధికారికైనా ఇదే పరిస్థితి వస్తుందన్నారు. టీడీపీ ఓట్ల వెరిఫికేషన్‌పై మానిటరింగ్ టీమ్ పెట్టామని, ఎక్కడైనా ఎవ్వరైనా తప్పు చేస్తే తెలిసిపోతుందన్నారు. ఏపీలో ఓటరు లిస్టు అక్రమాలపై త్వరలో ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను చంద్రబాబు కలుస్తారని బోండా ఉమ స్పష్టం చేశారు.

Updated Date - 2023-08-21T15:39:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising