ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bonda Uma: జగన్ కుట్రలకు ఆ 2 చోట్ల ప్రజలు బలైపోయారు

ABN, First Publish Date - 2023-01-05T13:12:57+05:30

సీఎం జగన్‌ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (Ycp Government)పై

జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సీఎం జగన్‌ (Cm jagan)పై టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (Ycp Government)పై ఫైరయ్యారు. ‘‘జగన్ ఒక ఫెయిల్యూర్ సీఎం. టీడీపీ (tdp)కి పెరిగిన ఆదరణ చూసి జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు కందుకూరు (Kandukuru), గుంటూరు తొక్కిసలాట సంఘటనలో ప్రజలు బలై పోయారు. దమ్ముంటే కందుకూరు, గుంటూరులో ఎందుకు తొక్కిసలాట జరిగిందో సీబీఐ(CBI) విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలి. మూడున్నరేళ్లలో ప్రజలు ప్రతిపక్ష పార్టీ మీటింగులకు వస్తున్నారంటే జగన్ పనైపోయింది. ఇక తన పని ఈ రాష్ట్రంలో అయిపోయింది అని జగన్ జీవో నంబర్ 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు. 1861 బ్రిటిష్ కాలం (British period) నాటి తుప్పెక్కిన సెక్షన్‌తో పాలనకు బూజులు దులిపారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి (Chandrababu)గా చేసిన వ్యక్తిని కుప్పంలోకి అడుగు పెట్టకుండా ఎస్‌ఐలు, సీఐలు లాఠీలతో అరాచకం చేశారు. జీవో 1తో తాడేపల్లి నుంచి ప్రతిపక్ష పార్టీల సభలకు అనుమతులు ఇస్తారట. 1861లో బ్రిటిష్ వాళ్లు తెచ్చిన చట్టాన్ని మహాత్మాగాంధీ (Mahatma Gandhi) దండయాత్ర ద్వారా వ్యతిరేకించారు. 175కి 175 వస్తాయన్నప్పుడు ఎందుకు చంద్రబాబును ఆపావు. జీవో వచ్చాక రాజమహేంద్రవరం (Rajamahendravaram)లో 4 కిలోమీటర్లు ర్యాలీ చేశావు. ఇప్పటికే సౌతాఫ్రికా చట్టం తెచ్చావు.. త్వరలో తాలిబాన్ చట్టం తెస్తావు. చరిత్రలో నియంతల చరిత్ర స్వల్ప కాలమే. తెలుగుదేశం ఆఫీస్ ముందు 200 మంది పోలీసులతో పాటు కంచెలు వేస్తావా? టీడీపీ అధికారంలో ఉండగా నిరోధించి ఉంటే ఎక్కడ ఉండేవాడివి జగన్. నిన్న మాది.. నేడు నీది.. రేపు మాది అని హెచ్చరిస్తున్నా. ఇంకో నాలుగు నెలల్లో జగన్ ఇంటికి వెళ్లిపోతున్నాడు. అధికారులు మీ సర్వీస్ రికార్డ్‌లు పాడు చేసుకోవద్దు. జీవో 1కు వ్యతిరేకంగా అన్ని సంఘాలు, పార్టీలతో కలిసి పోరాటం చేస్తాం. జగన్ పాదయాత్రలో 8 మంది చనిపోయారు... మండపేటలో ఇతర ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగాయి. మీ నాన్న (YS. Rajasekhara Reddy) హెలికాప్టర్‌ (Helicopter)లో వెళ్లి చనిపోయారు మీరు వాటిల్లో తిరగడం లేదా?.’’ అంటూ సీఎం జగన్‌ను బోండా ఉమ ప్రశ్నించారు.

Updated Date - 2023-01-05T13:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising