ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: జగన్ ప్రభుత్వం రైతుల్ని నిలువునా ముంచింది

ABN, First Publish Date - 2023-02-28T15:52:12+05:30

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర (Ex Minister Kollu Ravindra) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతులను నిలువునా దగా చేస్తున్న

నిలువునా ముంచింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కృష్ణా: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర (Ex Minister Kollu Ravindra) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రైతులను నిలువునా దగా చేస్తున్న జగన్.. రైతుల భరోసా పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేశారు. ఎన్నికల ముందు రైతులకు 15 వేలు ఇస్తామన్నారు. ఎన్నికల తరువాత 7500 ఇస్తున్నారు. కేంద్రం ఇస్తున్న 6 వేలు కలుపుకొని 13,500 ఇస్తున్నామని డబ్బా కొడుతున్నారు. రైతు భరోసా పేరుతో జగన్ (Jagan) చెప్పేవన్నీ అబద్దాలే. రైతులకు (Farmers) వేల కోట్ల సాయం చేశామంటూ ఇచ్చిన ప్రకటనలన్నీ మోసం, మాయ. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ (AP) 3వ స్థానంలో ఉంది. ఇప్పటివరకు 3 వేలమంది రైతులు ఆత్మ హత్యలకు పాల్పడ్డారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి అన్నారు. ఎంత మందికి ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. ధాన్యం కొనుగోళ్లలో లేనిపోని షరతులు పెట్టి రైతులను రోడ్డున పడేశారు. ఏ పంటకు మద్దతు ధర లభించలేదు. ధాన్యం సేకరణకు 37 లక్షల టన్నులకు కుదించారు. జగన్ మరిన్ని అప్పుల కోసం మోటార్లకు, మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరి బిగిస్తున్నారు. ఆక్వా రంగాన్ని నాశనం చేశారు. ఎన్నికల ముందు యూనిట్ 1.50 పైసలకు ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5.50 పైసలు చేశారు. ఆక్వా జోన్‌లు అని రైతులను నిలువునా ముంచారు. వ్యవసాయంలో క్రాప్ హాలిడే (Crop holiday) లాగా.. ఆక్వాలో కూడా హాలిడే ప్రకటిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరెంట్ బిల్ పది వేలు, ఇరవై వేలు వస్తుంటే ఇప్పుడు డెబ్భై వేలు, లక్ష వస్తుంది. రైతులు వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా రైతులకు ప్రభుత్వం మాయమాటలు కాకుండా నిజాయతీతో వారికీ మద్దతుగా నిలవాలి. ప్రకటనలు కాకుండా రైతులకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ (TDP) రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది.’’ అని కొల్లు రవీంద్ర హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Updated Date - 2023-02-28T15:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!