Payyavula: ‘అలా మాట్లాడించి గవర్నర్ స్థాయి తగ్గించారు’
ABN, First Publish Date - 2023-03-14T13:10:26+05:30
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశం ఎందుకు లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly Budget Session) లో గవర్నర్ (AP Governor) ప్రసంగంలో మూడు రాజధానుల అంశం (AP Capital Issue) ఎందుకు లేదని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ (TDP leader Payyavula Kesav) ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... సుప్రీంకోర్టు (Supreme Court) పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగంలో ఎందుకు పెట్టలేకపోయిందని నిలదీశారు. పాత గవర్నర్‌ను తాకట్టు పెట్టిన ప్రభుత్వం .... ప్రస్తుత గవర్నర్ స్థాయి తగ్గించారని విమర్శించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రిని పొగిడించటమేంటని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా అని అడిగారు. ప్రథమ పౌరుడితో సీఎంను పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారన్నారు. ముఖ్యమంత్రి రాక కోసం గవర్నర్‌ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారని తెలిపారు. ఇది సభా నిభంధనలకు విరుద్ధమన్నారు. శాంతి భద్రతల అంశం ఎక్కడా ప్రసంగంలో లేదన్నారు. ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్‌తో చెప్పించే యత్నం చేశారని వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా చేసిన గవర్నర్‌తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించిందని పయ్యావుల కేశవ్ విమర్శలు గుప్పించారు.
*******************************************************************
ఇది కూడా చదవండి..
AP Assembly: గవర్నర్‌తో అసత్యాలు పలికిస్తున్నారు... సభలో టీడీపీ సభ్యుల నినాదాలు.. వాకౌట్
Updated Date - 2023-03-14T13:13:08+05:30 IST