ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP NEWS: గన్నవరం ఫ్లెక్సీ రగడపై తెలుగుదేశం నేతలు ఫైర్.

ABN, First Publish Date - 2023-08-24T17:50:18+05:30

వైసీపీ(YCP) గూoడాలను పోలీస్ స్టేషన్‌కి పంపించి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రజాస్వామ్యం ఖూనీకి యత్నించారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మండిపడ్డారు.

అమరావతి: వైసీపీ(YCP) గూoడాలను పోలీస్ స్టేషన్‌కి పంపించి జగన్మోహన్‌రెడ్డి(Jagan Mohan Reddy) ప్రజాస్వామ్యం ఖూనీకి యత్నించారని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) మండిపడ్డారు. ‘‘తెలుగుదేశం వాళ్లు ఫిర్యాదుకు వచ్చారు, మీరు రండి అంటూ పోలీసులే ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు.ఫిర్యాదు తీసుకోవటంలోనూ, రసీదు ఇవ్వటంలోనూ తీవ్ర జాప్యం చేశారు.పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ గూoడాలు మమ్మల్ని ఎంత రెచ్చకొట్టినా సంయుమనం పాటించాం’’ అని దేవినేని ఉమా తెలిపారు.

కవ్విoచేలా వైసీపీ బ్యానర్: యార్లగడ్డ వెంకట్రావ్

నారా లోకేష్ యువగళం పాదయాత్రను కవ్విoచేలా వైసీపీ బ్యానర్ కట్టినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని తెలుగుదేశం గన్నవరం ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావ్(Yarlagadda Venkatarao) ప్రశ్నించారు. వంశీకి భయపడే వాళ్లు ఎవ్వరూ లేరన్నారు. పోలీస్‌స్టేషన్‌కి వచ్చి హడావుడి చేసినంత మాత్రాన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేరని యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు.

పోలీసులే ఉసిగొల్పారు: కొల్లు రవీంద్ర

పోలీస్‌స్టేషన్‌లో కూడా తమపై దాడికి వైసీపీ శ్రేణుల్ని పోలీసులే ఉసిగొల్పారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర(Kollu Ravindra) అన్నారు. వైసీపీ నేతలు వంశీ- కొడాలి నానిలకు లోకేష్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక పిరికి చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.ఉమ్మడి కృష్ణ జిల్లాపై ఎలాంటి చర్చకైనా లోకేష్ సింగిల్‌గా రాగలడని చెప్పారు. లోకేష్‌కి సమాధానం చెప్పే సత్తా వైసీపీ ఎమ్మెల్యే లకు ఉందా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు.

పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూస్తాం: కొనకళ్ల నారాయణ

తమ ఫిర్యాదు పట్ల పోలీసులు ఎలా స్పందిస్తారో వేచి చూస్తామని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ(Konakalla Narayana) అన్నారు. పోలీసుల స్పందన సరిగా లేకుంటే చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - 2023-08-24T20:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising