కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి

ABN , First Publish Date - 2023-06-20T01:19:39+05:30 IST

కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని మచిలీపట్నం నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు చిన్నం శివనాగేశ్వరరావు, నాయకులు పంచపర్వాల కాశీవిశ్వనాథం డిమాండ్‌ చేశారు.

 కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించాలి
టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద ధర్నా

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 19 : కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని మచిలీపట్నం నియోజకవర్గ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు చిన్నం శివనాగేశ్వరరావు, నాయకులు పంచపర్వాల కాశీవిశ్వనాథం డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు కార్మికుల ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద టీఎన్‌టీయూసీ నాయకులు ధర్నా నిర్వహించారు. పంచపర్వాల కాశీవిశ్వనాథం మాట్లాడుతూ, 2014 జూన్‌ 2వ తేదీ నాటికి ఐదు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పట్టణ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు రాగి చంద్రి, రామగాని రత్నారావు, అడపా రత్నారావు, వనరాజు, లోగిశెట్టి స్వామి, సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. లా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2023-06-20T01:19:39+05:30 IST