ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gannavaram: లోకేష్, యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2023-08-23T13:47:04+05:30

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, శ్రేణులు తెలుగుదేశంలో చేరారు. టీడీపీలో చేరిన వారిలో సిట్టింగ్ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, సర్పంచ్‌లు, సహకార బ్యాంకు సభ్యులు, ఇతర నియోజకవర్గం నేతలు ఉన్నారు.

కృష్ణాజిల్లా: గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావ్ (Yarlagadda Venkatarao) ఆధ్వర్యంలో నారా లోకేష్ (Nara Lokesh) సమక్షంలో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు (YCP Leaders), శ్రేణులు తెలుగుదేశం (Telugudesam Party)లో చేరారు. టీడీపీలో చేరిన వారిలో సిట్టింగ్ ఎంపీటీసీ (MPTC)లు, మాజీ ఎంపీపీలు (Ex MPP), సర్పంచ్‌లు (Sarpanches), సహకార బ్యాంకు సభ్యులు (Co-operative Bank Members), ఇతర నియోజకవర్గం నేతలు (Other Leaders) ఉన్నారు. యార్లగడ్డ వెంట తెలుగుదేశంలో చేరేందుకు వైసీపీ నుంచి భారీ స్థాయిలో కీలక నేతలు, కార్యకర్తలు వచ్చారు. వంశీ వైసీపీకు వెళ్ళినప్పుడు ఆయన వెంట వెళ్లకుండా టీడీపీలో పసుపు శ్రేణులు ఉండిపోయారు.

ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ వంశీ ఓటమి కోసం అంతా కలిసికట్టుగా పనిచేస్తామని, కంచుకోటలో తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. ఆత్మాభిమానంతోనే తెలుగుదేశంలోకి వస్తున్నాం తప్ప మరేదీ ఆశించి కాదన్నారు. వైసీపీలో గ్రామ స్థాయి నుంచీ రాష్ట్ర స్థాయి వరకూ ఏ ఒక్కరికీ గౌరవం లేదన్నారు. తాము రౌడీయిజం చేయటానికి రాలేదని, రాజకీయం కోసమే వచ్చామన్నారు. కొత్త, పాత కలయికల్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఏ ఒకరికి సమస్య ఉన్నా నేరుగా తనకే చెప్పాలని సూచించారు. ఐక్యంగా గన్నవరంలో గెలిచి ముందు తెలుగుదేశం జెండా ఎగురవేద్దామని యార్లగడ్డ వెంకట్రావు పిలుపిచ్చారు.

Updated Date - 2023-08-23T13:47:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising