ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama: వైసీపీ ఇప్పుడు చిల్లుపడిన నావ...

ABN, First Publish Date - 2023-03-24T16:09:58+05:30

ఢిల్లీ: రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఢిల్లీ: రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) వైసీపీ ప్రభుత్వం (YCP Govt.)పై తీవ్ర విమర్శలు చేశారు. ‘మా పార్టీ ఇప్పుడు చిల్లుపడిన నావ.. తెలివి గల రాజకీయ నాయకుడు ఈదుకుంటూ వెళ్ళిపోతారు’’ అని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవిలో ఉన్న సజ్జల (Sajjala), సీఎం జగన్ (CM Jagan).. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వాలని సూచించారు. 23 ఓట్లతో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి అనురాధ (Anuradha)కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

గతంలో పోలవరం (Polavaram)పై సీఎం జగన్ రాసిన లేఖ (Letter) ఇప్పుడు శాపం అయిందని, పోలవరంపై ముఖ్యమంత్రి ఫోకస్ (Focus) చేసి ఉంటే బాగుండునని రఘురామ అన్నారు. బాబాయ్ కేసులు, ఇతర అంశాలపై దృష్టి పెట్టడంతో ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయన్నారు. టీడీపీ (TDP)లో తాను ఉన్నప్పుడు మొదట పొలవరంకు బస్సులు వేసి చూపించానన్నారు. పోలవరం ఇంకో ఏడాదిలో ప్రారంభిస్తామని అంటున్నారు... ఎన్నికలు రాబోతున్నాయి.. ముఖ్యమంత్రి మారతారని ప్రజలు అంటున్నారని రఘురామ అన్నారు.

ఇప్పటికైనా వెలిగొండ ప్రాజెక్టు (Veligonda Project)పై సీఎం జగన్ దృష్టి పెట్టాలని, పక్క రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ (CM KCR) కాళేశ్వరం (Kaleswaram) పూర్తి చేశారని, పోలవరం పూర్తి చేస్తే రాష్ట్రం బాగుంటుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు. బటన్ నొక్కితే ఎం వస్తుంది ..సొంత ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు.. పోలవరంపై రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలని.. విపక్షాలను పిలవాలని.. అలాగే తనను కూడా పిలవాలని సూచించారు. ప్రజలు పార్టీలకు అతీతంగా వైసీపీని ఓడించాలని చూస్తున్నారని, బలంగా ఉన్న పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారని రఘురామ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-03-24T16:09:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising