భక్తులతో పోటెత్తిన మహానంది
ABN , First Publish Date - 2023-05-22T00:02:14+05:30 IST
మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. వేషవి సెలవులు కావడంతో కుటుంభ సమేతంగా దైవదర్శనం కోసం క్షేత్రానికి తరలివచ్చారు.
మహానంది, మే 21: మహానంది క్షేత్రం ఆదివారం భక్తులతో పోటెత్తింది. వేషవి సెలవులు కావడంతో కుటుంభ సమేతంగా దైవదర్శనం కోసం క్షేత్రానికి తరలివచ్చారు. అలాగే మంచి ముహూర్తం ఉండటంతో ఆలయం పరిసరాల్లో పదుల సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఒక వైపు పెళ్లి బృందాల రద్దీ, మరోవైపు భక్తులతో ఆలయం పరిసరాలు క్రిక్కిరిసి పోయాయి. దర్శనం కంటే ముందు కుటుంభ సమేతంగా ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరుతో పాటు పూల కోనేర్ల ల్లో భక్తులు పిల్లాపాపలతో పుణ్యస్నానాలు ఆచరించారు.