TDP Leader: దమ్ముంటే స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్‌లకు రండి.. ఆధారాలు చూపిస్తాం
ABN, First Publish Date - 2023-10-06T13:52:56+05:30
టీడీపీ అధినేత చంద్రబాబుపై చేసిన ఆరోపణలలో ఒక్క దాన్ని కూడా ఆధారాలతో నిరూపించలేక పోయారని మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అన్నారు.
కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుపై (TDP Chief Chandrababu) చేసిన ఆరోపణలలో ఒక్క దాన్ని కూడా ఆధారాలతో నిరూపించలేక పోయారని మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర (Former MLC Beeda Ravichandra) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అతి తక్కువ ధరకే ఫైబర్ గ్రిడ్ సేవల్ని చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోందని ప్రధాని మోడీ (PM Modi), టెలికాం శాఖ అభినందించిందని తెలిపారు. దమ్ముంటే వైసీపీ నాయకులు, సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లకు రావాలని.. ఆధారాలు చూపిస్తామని సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను పులివెందులలో కూడా పెట్టారని తెలిపారు. వైసీపీ (YCP) ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మరన్నారు. కమ్యూనిస్టులు మాట్లాడితే అమ్ముడు పోయారని అనడం దుర్మార్గమన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్నప్పుడు కమ్యూనిస్టులను ఎంతకుకొన్నారని ప్రశ్నించారు. జగన్ అరాచక అవినీతి పాలన చేస్తున్నారని బీజేపీ నేతలే అంటున్నారని... వారికి జగన్ సమాధానం చెప్పాలని బీద రవిచంద్ర డిమాండ్ చేశారు.
Updated Date - 2023-10-06T13:52:56+05:30 IST