YuvaGalam: మంత్రాలయం నియోజకవర్గంలోకి ప్రవేశించిన లోకేష్ పాదయాత్ర
ABN, First Publish Date - 2023-04-25T09:50:52+05:30
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర (Nara Lokesh YuvaGalam Padayatra) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో యువనేత పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఆదోని నియోజకవర్గం తుంబళం క్రాస్ విడిది కేంద్రం నుంచి 80వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. కాసేపటికే మంత్రాలయం నియోజకవర్గంలోకి నారా లోకేష్ ప్రవేశించారు. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ ఇంఛార్జ్ తిక్కారెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నేడు గవిగట్టు, బావులదొడ్డి, పీకలబెట్ట, కోసిగి గ్రామాల్లో స్థానికులతో సమావేశం అవనున్నారు. సాయంత్రం కోసిగి ఎల్లమ్మ దేవాలయం వద్ద నారా లోకేష్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాత్రికి కోసిగి శివారులో యువనేత రాత్రి బస చేయనున్నారు.
లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. ప్రతీచోట లోకేష్ పాదయాత్రకు అభిమానులు, యువత మద్దుతు తెలుపుతున్నారు. ప్రతీరోజు దాదాపు వెయ్యి మందితో లోకేష్ సెల్ఫీలు దిగుతున్నారు. తమ అభిమాన నేత ఆప్యాయంగాల పలకరిస్తూ సెల్ఫీలు దిగడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి 79వ రోజు పాదయాత్రలో భాగంగా జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అందరికి లోకేష్ శుభాకాంక్షలు తెలియజేశారు. తుంబళం క్రాస్ వద్ద ‘పల్లె ప్రగతి కోసం మీ లోకేష్’ అనే కార్యక్రమం నిర్విహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన సర్పంచులతో లోకేష్ సమావేశం అయ్యారు.
Updated Date - 2023-04-25T09:53:18+05:30 IST